Begin typing your search above and press return to search.

ఇంకా ఈ బాహుబలి 'కిలికి' భాష ఎందుకో?

By:  Tupaki Desk   |   20 Feb 2020 4:09 AM GMT
ఇంకా ఈ బాహుబలి కిలికి భాష ఎందుకో?
X
రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా ఇండెప్త్‌ గా వెళ్లి మరీ తెరకెక్కిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో కూడా లోతుగా అధ్యయనం చేసి మరీ తన సినిమాలో సీన్స్‌ ను పెడతాడు. బాహుబలి మొదటి పార్ట్‌ లో కాలకేయులు మహిష్మతి రాజ్యంపై దండయాత్రకు వచ్చే సీన్స్‌ ఉంటాయి. అవి ఉండేవి కొద్ది సమయమే అయినా.. ఆ కాలకేయులు కొద్ది సమయమే కనిపించినా కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన భాషను తయారు చేయించారు.

తమిళ రచయిత మదన్‌ కార్కీ కాలకేయుల భాష కిలికి ని తయారు చేయడంతో పాటు దానికి ఒక లిపిని కూడా తయారు చేశాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడు కిలికి కూడా యాడ్‌ అయ్యింది. సినిమా విడుదలైన తర్వాత కిలికి భాష గురించి అంతా మర్చి పోయారు. కాని ఆయన మాత్రం ఆ భాషకు లిపిని తయారు చేయడంతో పాటు జనాలు నేర్చుకునేందుకు అందుబాటులోకి తీసుకు వస్తున్నాడు.

కిలికి భాషకు సంబంధించి ఒక వెబ్‌ సైట్‌ ను కూడా అధికారికంగా తయారు చేయడం జరిగింది. దాన్ని త్వరలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నాడు. ఆ వెబ్‌ సైట్‌ ద్వారా కిలికి భాషను నేర్చుకోవచ్చు అంటు రచయిత మదన్‌ తెలియజేశారు.

ప్రపంచంలోనే అత్యంత సులువైన కిలికి భాషను నేర్చుకోవాలంటే వచ్చేయండి అంటూ మదన్‌ తన సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేయడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే కొందరు మాత్రం ఇన్ని భాషలు ఉండగా.. బాహుబలి అయిన తర్వాత మళ్ళీ కిలికి భాష ప్రస్తావన ఎందుకో అంటూ ప్రశ్నిస్తున్నారు.