'డంకీ' లో బాద్ షా ఇంత స్మార్ట్ గానా?

Fri May 13 2022 06:00:01 GMT+0530 (IST)

SRK on Dunki movie set

బాద్ షా షారుక్ ఖాన్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఖాన్ భాయ్ కి సరైన సక్సెస్ లేదు. భారీ బడ్జెట్ చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద అనే పనిగా బోల్తా కొడుతున్నాయి. షారుక్ చివరి సినిమా  `జీరో` ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి దారుణమైన ఫలితాన్ని చవి చూసింది. ఇలా వరుస వైఫల్యాలతో బాద్ షా సక్సెస్ కోసం  కాకతో రగిలిపోతున్నారు.దీంతో అన్ని లెక్కలు సరి చేయడానికి షారుక్ రెడీ అవుతున్నారు. వరుసగా కొత్త ప్రాజెక్ట్ లు ప్రకటిస్తూ అభిమానుల్ని ఖుషీలో ముంచేస్తున్నారు. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు  ఇతర స్టార్ల చిత్రాల్లోనూ  కామియో పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే `పఠాన్` షూటింగ్ పూర్తి చేసిన షారుక్ ఆ వెంటనే కోలీవుడ్ దర్శకుడు అట్లీ సినిమాని సెట్స్ కి తీసుకెళ్లారు.

ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసారు. ఆ సినిమా సెట్స్ లో ఉండగానే రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో `డుంకీ` చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లారు.  ప్రస్తుతం షారుక్ ఈ రెండు సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉన్నారు. తాజాగా `డంకీ` సెట్ లో తీసిన ఓ గ్రూప్ ఫోటో ఒకటిప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  ఇందులో షారుక్ స్మార్ట్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు.

బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో  వైట్ షూస్ ధరించి..కళ్లకి నల్లటి అద్దాలు పెట్టుకుని కెమెరాకి ఫోజులిచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఫోటో నైట్ టైమ్ తీసినట్లు తెలుస్తుంది. షారుక్ ఫోటోపై అభిమానులు స్మార్ట్ హీరో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటో దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీతో పాటు సినిమాకు పని చేస్తున్న కీలక సభ్యులంతా కనిపిస్తున్నారు.

ఇందులో షారుక్ కి జోడీగా తాప్సీ నటిస్తుంది.  రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ - జియో స్టూడియోస్ భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. `డంకీ` షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి 2023 డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.