Begin typing your search above and press return to search.

షారుఖ్.. ఆ సినిమాతో ఇంకా గట్టిగా..

By:  Tupaki Desk   |   28 Jan 2023 2:00 PM GMT
షారుఖ్.. ఆ సినిమాతో ఇంకా గట్టిగా..
X
షారుక్ ఖాన్ హీరోగా సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం పఠాన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించగా దీపికా పదుకునే హీరోయిన్ గా చేసింది. ఇక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఇండియన్ రా ఏజెంట్ గా నటించాడు. కథ రొటీన్ గా ఉన్న కూడా మేకింగ్ మాత్రం అద్బుతంగా ఉందనే స్పందన వస్తుంది. ఇక బాలీవుడ్ లో సెలబ్రిటీ ప్రముఖులు అందరూ కూడా పఠాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కామన్ ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

మొదటి రోజు 55 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు మరింత పెరిగి ఏకంగా 60 కోట్ల షేర్ ని రాబట్టింది. దీనిని బట్టి పఠాన్ కి ప్రేక్షకుల నుంచి స్పందన పెరిగిందనే మాట వినిపిస్తుంది. ఈ కలెక్షన్స్ ఈ వీకెండ్ లో మరింత పెరిగే ఛాన్స్ ఉందని అందరూ భావిస్తున్నారు. సరైన కథ పడితే షారుక్ ఖాన్ స్పీడ్ ని ఎవరూ అడ్డుకోలేరనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డులని పఠాన్ మూవీ బ్రేక్ చేసింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డుని కూడా బ్రేక్ చేసింది.

ఇదే స్పీడ్ ఈ వారంతం కొనసాగితే కచ్చితంగా 500 కోట్ల గ్రాస్ ని దాటిపోవడం పక్కా అనే మాట వినిపిస్తుంది. లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులని క్రియేట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే టాక్ బిటౌన్ లో వినిపిస్తుంది. సౌత్ డామినేషన్ తో ఇన్ని రోజులు ఆందోళనలో ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీకి పఠాన్ మూవీ ఊపిరి పోసిందని చెప్పాలి. ఈ నేపధ్యంలోనే మూవీని బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పైకి లేపుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత అత్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ జవాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పటికే వచ్చింది. పఠాన్ మూవీ తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబడుతుంది. మరి పఠాన్ మూవీకి ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తూ ఉంటే అత్లీ దర్శకత్వంలో సౌత్ స్టైల్ లో రాబోతున్న జపాన్ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అనే మాట వినిపిస్తుంది. దీనికి కారణం జవాన్ సినిమాలో ఇళయదళపతి విజయ్ కూడా గెస్ట్ రోల్ లో చేయబోతూ ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.