అఖండ వేదికపై బాలయ్య గురించి బాలు తనయుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sun Nov 28 2021 12:00:55 GMT+0530 (IST)

SP Charan Akhanda Pre Release Event

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా విడుదల కు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖండ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైభవంగా నిర్వహించారు. అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ ఈ సినిమాలో ఒక పాట పాడాడు. ఆయన మొదటి సారి బాలకృష్ణ సినిమాలో పాట పాడారు. స్టేజ్ పై కూడా ఆ పాటను చరణ్ పాడాడు. ఆ సందర్బంగా చరణ్ మాట్లాడుతూ బాలయ్య యొక్క గొప్పతనంను మరియు ఆయన మంచితనంను చెప్పుకొచ్చాడు.ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. నాన్న గారు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఎన్నో బాలకృష్ణ గారి సినిమాల్లో పాటలు పాడారు. ఇన్నాళ్లకు నాకు పాడే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. బాలకృష్ణ గారు నాన్న గారు ఆసుపత్రిలో ఉన్న సమయంలో పూజ చేయించడం ఎప్పటికి మర్చి పోలేను. నాన్న గారి ఆరోగ్యం కోసం ఆయన ప్రార్థనలు చేశారు. ఆయన పదే పదే నాకు మా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నాన్న గారి ఆరోగ్యం గురించి తెలుసుకునే వారు. ఆయన మా కుటుంబం పట్ల చూపించిన ఆధరణ ఎప్పటికి మర్చిపోలేనంటూ ఎస్పీ చరణ్ అఖండ ప్రీ రిలీజ్ వేదిక పై నందమూరి అభిమానుల సాక్షిగా కాస్త ఎమోషనల్ అయ్యాడు.

బాలయ్య మరియు బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందిన అఖండ సినిమా విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. ఈ వారంలోనే అఖండ సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. భారీ అంచనాల నడుమ హ్యాట్రిక్ కొట్టేందుకు వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లను దక్కించుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో ఎస్పీ చరణ్ పాడిన పాటతో పాటు పలు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా ముందుకు వచ్చి సినిమా పై ఆసక్తికర విషయాలను తెలియజేస్తున్నారు.