మల్టీస్టారర్ చేయడానికి రెడీ అయిన 'Rx 100' హీరో..?

Mon May 03 2021 15:15:50 GMT+0530 (IST)

'Rx 100' hero ready to do multistarrer ..?

యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ట్రై చేస్తున్నాడు. 'Rx 100' సినిమాతో సక్సెస్ అందుకున్న కార్తికేయ.. కేవలం హీరోగా చేయాలి అనుకోకుండా మంచి అవకాశం వచ్చినప్పుడు విలన్ గానూ నటిస్తున్నాడు. నాని 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన కార్తికేయ.. ప్రస్తుతం తమిళ్ లో 'వలిమై' అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అజిత్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ వర్గాల్లో యువ హీరో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మరి త్వరలోనే కార్తికేయ కోలీవుడ్ లో కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.ఇటీవలే 'చావు కబురు చల్లగా' సినిమాలో మాస్ పాత్రలో నటించి మెప్పించిన కార్తికేయ.. ఇప్పుడు ఓ మల్టీస్టారర్ చేయడానికి రెడీ అయ్యారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే ఇందులో హీరోగా చేస్తున్నాడా లేదా విలన్ రోల్ చేయబోతున్నాడా అన్నది ఇంకా కంఫర్మ్ అవ్వలేదట. ఈ వార్తల్లో నిజమెంతో అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ఇకపోతే కార్తికేయ ప్రస్తుతం '#KG7' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో కార్తికేయ ఓ సినిమా చేయనున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తుండటం విశేషం.