Begin typing your search above and press return to search.

పాపం అనురాగ్‌ కశ్యప్‌ అంత ఈజీగా దొరికేశాడా?

By:  Tupaki Desk   |   23 Sep 2020 1:30 AM GMT
పాపం అనురాగ్‌ కశ్యప్‌ అంత ఈజీగా దొరికేశాడా?
X
మొన్నటి వరకు దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ క్లీన్‌ ఇమేజ్‌ తో తన సినీ కెరీర్‌ ను కొనసాగిస్తు వస్తున్నాడు. అయితే మీటూ అంటూ సౌత్‌ హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌ అతడిపై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసింది. దాంతో ఆయనపై మహిళ సంఘాలు మరియు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు మాటల దాడి చేస్తున్నారు. మీడియాలో కూడా అనురాగ్‌ కశ్యప్‌ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలోనే కొందరు ఆయనకు మద్దతుగా నిలిచే వారు కూడా ఉన్నారు. తాజాగా కోల్‌ కత్తాకు చెందిన బెంగాలీ నటి రూపాదత్తా కూడా తనను ఫేస్‌ బుక్‌ చాట్‌ ద్వారా అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేదించాడంటూ స్క్రీన్ షాట్‌ లను మీడియా ముందుకు తీసుకు వచ్చింది.

ఒక టీవీ ఛానెల్‌ చర్చ కార్యక్రమంలోకి కూడా వెళ్లి తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె ఆరోపించింది. 2014 నాటి ఛాటింగ్‌ ను ఇప్పుడు ఆమె మీడియా ముందుకు తీసుకు వచ్చింది. అయితే అవి అనురాగ్‌ కశ్యప్‌ పేరుతో కాకుండా అనురాగ్‌ సఫర్‌ పేరుతో ఉన్నాయి. ఆ విషయాన్ని ఆమె గమనించకుండానే మీడియా కు ఎక్కేసింది. ఆ విషయం తెలిసిన తర్వాత అనురాగ్‌ కశ్యప్‌ కు డ్రగ్స్‌ రాకెట్‌ తో సంబంధం ఉంది అన్నట్లుగా విమర్శలు చేయడం మొదలు పెట్టింది.

అనురాగ్‌ కశ్యప్‌ అంటూ గతంలో అనురాగ్‌ సఫర్‌ ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ ఉండేది. గతంలో ఫేస్ బుక్‌ లో అనురాగ్‌ సఫర్‌ స్పందిస్తూ తాను దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ను కాదని తనకు అనురాగ్‌ కశ్యప్‌ కు సంబంధం లేదంటూ పేర్కొన్నాడు. ఇతడు ఐర్లాండ్‌ లో ఉంటాడు. అతడి నుండి రూపాదత్తాకు మెసేజ్‌ లు వచ్చాయి. ఆమె పొరపాటున అనురాగ్‌ కశ్యప్‌ అంటూ బలి చేసింది. ఇప్పటికే పాయల్‌ ఘోష్‌ ఎలాగూ మీటూ ఆరోపణలు చేసింది కనుక అంతా ఈజీగా నమ్మేస్తారు అనుకుందో ఏమో పాపం అనురాగ్‌ కశ్యప్‌ పై మీటూ ఆరోపణలు చేసి బొక్క బోర్లా పడింది.