మెగాస్టార్ ఆచార్యలో మరో స్టార్ హీరోనా..??

Tue Jul 14 2020 15:00:30 GMT+0530 (IST)

Another star hero in Megastar Acharya .. ??

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. మెగాస్టార్ కెరీర్ లో 152వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా పై సినీ వర్గాలలో మెగా అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో టాప్ డైరెక్టర్ స్థానంలోకి చేరాడు. తన ప్రతి సినిమాలో ఏదొక సందేశంతో మాస్-క్లాస్ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తూనే ఉన్నాడు కొరటాల. ఇటీవలే 'సైరా నరసింహరెడ్డి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ 'ఆచార్య'తో త్వరలో సందడి చేయనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆచార్య సినిమాలో విలన్ పాత్రకు తమిళ యాక్టర్ రహమాన్ సెలక్ట్ అయినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందట.ఆ పాత్ర కోసం హీరో రానాతో సంప్రదింపులు జరుగుతున్నాయట. అయితే తక్కువ నిడివి ఉన్న కూడా పాత్రకు ప్రాధాన్యత ఉందని రానా కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ఈ సినిమాలో రాంచరణ్ పాత్ర దాదాపుగా 30 నిముషాల వరకు ఉండబోతుందట. అంతేగాక ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్ క్యారెక్టర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రాంచరణ్ పాత్రకి ఓ హీరోయిన్ ఉంటుందట. ఇంకా మెగా డాటర్ నిహారిక ఓ పాత్రలో మెరవనుంది. ఇదివరకే సైరా నరసింహ రెడ్డి సినిమాలో కనిపించింది నిహారిక. అంతేగాక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం చిత్రబృందం రాంచరణ్ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో పడిందట. మాట్నీ ఎంటర్టైన్మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.