Begin typing your search above and press return to search.

ప్రభాస్ నిర్మాతలు బాహుబలిని ఫాలో కానున్నారా..?

By:  Tupaki Desk   |   15 July 2020 1:00 PM GMT
ప్రభాస్ నిర్మాతలు బాహుబలిని ఫాలో కానున్నారా..?
X
డార్లింగ్ ప్రభాస్.. ఆయన ప్రతీ సినిమాలో విభిన్నమైన క్యారెక్టర్లను, న్యూ ట్రెండీ డ్రెస్సింగ్ స్టైల్ పరిచయం చేస్తూ వస్తున్నాడు. అందుకు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, సాహో లాంటి సినిమాలు ఉదాహరణగా చెప్పొచ్చు. వాటిలో తన హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంటుగా చూపించి ఆకట్టుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తన తదుపరి చిత్రాలన్నీ భారీ లెవెల్ లోనే రూపొందించి వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నాడు. బాహుబలి, సాహో లాంటి భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల తర్వాత డార్లింగ్ ప్రస్తుతం పీరియాడిక్ లవ్ డ్రామా మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ పాన్ ఇండియా మూవీ పేరు 'రాధేశ్యామ్' అని రివీల్ చేశారు మేకర్స్.

జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, పూజ హెగ్డేల లుక్స్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. అయితే ఇంతకాలం నిరాశతో ఎదురు చూసిన డార్లింగ్ అభిమానులకు ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు. ఇక అప్పటి నుండి ప్రభాస్ అభిమానులలో ఆనందం మాములుగా లేదు. ప్రభాస్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ లో డార్లింగ్ మరీ స్టైల్ గా కనిపించేసరికి లేడీ ఫ్యాన్స్ మనసు పారేసుకుంటున్నారు. ఇక తాజాగా రూపొందుతున్న సినిమాలో అప్పటి పీరియాడిక్ టైంలో ఉండే లుక్స్ అండ్ నేటి ఆధునిక స్టైల్ తో.. కనిపిస్తాడని సమాచారం. 1960లోని గాఢమైన ప్రేమకథ కాబట్టి ఆ ట్రెండ్ కి, ఆధునిక ట్రెండ్ తగ్గ లుక్స్ డిజైన్ చేస్తున్నారట చిత్రయూనిట్.

అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీ గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ రాధేశ్యామ్ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 24న రిలీజ్ చేయాలనీ మేకర్స్ ఆలోచిస్తున్నారట. సరిగ్గా అదే తేదీన ప్రభాస్ బాహుబలి-2 విడుదల అయి బాక్సాఫీస్ షేక్ చేసింది. అప్పుడు రిలీజ్ చేస్తే ఈ సినిమా కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ ప్రొడక్షన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ.. ఇతర బాషలలో రిలీజ్ కానుంది. మరి బాహుబలి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.. లేక ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.