గురు శిష్యుల మధ్య మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..!

Sun Jun 26 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Rumours on Tollywood Director

సినిమాలు మరియు వివాదాలతో సావాసం చేస్తూ తనకు నచ్చినట్లు బ్రతికే సంచలన దర్శకుడు ఒకరు.. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. టాలీవుడ్ కు కొత్తదారి చూపిన ఆయన.. న్యూ టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయమవ్వడానికి కారణమయ్యారు. ఈ క్రమంలో ప్రతిభావంతులైన తన శిష్యులను కూడా డైరెక్టర్స్ గా ఇంట్రడ్యూస్ చేశారు.సీనియర్ దర్శకుడి వద్ద శిష్యరికం చేసిన ఎంతోమంది ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ గా రాణిస్తున్నారు. వారిలో ఒక ప్రియ శిష్యుడితో గురువుకు ప్రత్యేకమైన సాన్నిహిత్యం ఉంది. వీరిని గురు శిష్యులు అనడం కంటే మంచి స్నేహితులుగా పేర్కొనవచ్చు. వీలు కుదిరినప్పుడల్లా కలిసి పార్టీలు చేసుకుంటూ చిల్ అవుతుంటారు.

సినిమాల విషయానికొస్తే మేకింగ్ లో ఇద్దరి దారులు వేరు.. వారి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం వ్యవహార శైలి మరియు జీవన విధానం వారిద్దరినీ స్నేహితులుగా మార్చేశాయి. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరికీ పడటం లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి.

దర్శక గురు శిష్యులకు చెడిందని.. ఇద్దరికీ ఇప్పుడు మాటల్లేవని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అంతేకాదు వీరి మధ్య దూరం పెరగడానికి ఓ మహిళా నిర్మాత కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో కొన్నాళ్ళు స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన ఓ బ్యూటీ.. తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టింది. దీనికి ఆ స్టార్ డైరెక్టర్ సపోర్ట్ గా నిలిచారు. తన బ్యానర్ లోనే మేజర్ షేర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ జాయింట్ ప్రొడక్షన్ లో పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ రూపొందుతున్నాయి.

ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా.. నిర్మాత వచ్చిన తర్వాత దర్శకుడి లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయని అంటున్నారు. ఇది ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభావం చూపిందని పుకార్లు వస్తున్నాయి. ఆమె విషయంలో దర్శకుడిని అతని గురువు హెచ్చరించాడట.

కానీ శిష్యుడు తన మాటలు వినకపోవడం వల్ల మాట్లాడటం మానేశాడట. ప్రస్తుతం ఇద్దరి మధ్య మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అని అనుకుంటున్నారు. మరి త్వరలోనే ఇద్దరూ కలుసుకొని రూమర్స్ కు చెక్ పెడతారేమో చూడాలి.