Begin typing your search above and press return to search.

రామ్ - బోయ‌పాటి సినిమాపై అవి రూమ‌ర్సేనా?

By:  Tupaki Desk   |   28 Jun 2022 12:30 AM GMT
రామ్ - బోయ‌పాటి సినిమాపై అవి రూమ‌ర్సేనా?
X
క్రేజీ హీరో ఉస్తాద్ రామ్ న‌టిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'ది వారియ‌ర్‌'. త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో బై లింగ్వ‌ల్ మూవీగా ఈ సినిమాని ఏక కాలంలో రూపొందిస్తున్నారు.

జూలై 14న ఈ మూవీని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే డేట్ ని ప్ర‌క‌టించి భారీగా ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించేశారు. కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తున్నఈ మూవీకి దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన మూడు లిరిక‌ల్ వీడియోలు నెట్టింట సంద‌డి చేస్తూ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి. టీజ‌ర్ కు కూడా మంచి స్పంద‌న ల‌భించింది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత హీరో రామ్ యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్ లో ఓ భారీ మూవీకి రెడీ అయిపోతున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో సెట్స్ పైకి రానున్న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు కూడా ఇటీవ‌లే పూర్త‌య్యాయి.

అయితే ఇది రామ్ సోలో హీరోగా న‌టిస్తున్న మూవీ కాద‌ని, త‌మిళ క్రేజీ హీరో శివ కార్తీకేయ‌న్ కూడా ఇందులో న‌టిస్తున్నార‌ని, సో ఈ మూవీని మ‌ల్టీస్టార‌ర్ గా తెర‌కెక్కించ‌బోతున్నార‌ని, అంతే కాకుండా ఈ మూవీలో హీరో రామ్ సీనియ‌ర్ స్టార్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ డైహార్డ్ ఫ్యాన్ గా క‌నిపించ‌బోతున్నార‌ని ప్రాచ‌రం జ‌రుగుతోంది. దీంతో రామ్ ఫ్యాన్స్ ఒక్క సారిగా షాక్ కు గుర‌య్యారు.

అయితే ఇవ‌న్నీ రూమ‌ర్స్ అని, రామ్ - బోయ‌పాటి మూవీలో శివ కార్తికేయ‌న్ న‌టించ‌డం లేద‌ని, అంతే కాకుండా బాల‌కృష్ణ అభిమానిగా రామ్ క‌నిపిస్తార‌న్న‌ది కూడా గాలి వార్తేన‌ని తెలిసింది. ఈ విష‌య‌మై చిత్ర బృందంకు అత్యంత స‌న్నిహితంగా వుండే వ‌ర్గాలు ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని కొట్టి పారేశారు. దీంతో రామ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నార‌ట‌.

ఇటీవ‌ల 'ది వారియ‌ర్‌' మూవీకి సంబంధించిన 'విజిల్' లిరిక‌ల్ వీడియో రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ పాన్ ఇండియా మూవీ అంటూ అరుపులు కేక‌లు పెట్ట‌డంతో హీరో రామ్ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా అంటూ క్లానిటీ ఇచ్చారు. అంటే బోయ‌పాటి సినిమా పాన్ ఇండియా మూవీ అని క్లారిటీ ఇచ్చేశార‌న్న‌మాట‌. 'ది వారియ‌ర్‌' రిలీజ్ త‌రువాత నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలిసింది.