విడాకులపై హేమచంద్ర శ్రావణ భార్గవి ఎట్టకేలకు నోరు విప్పారు

Wed Jun 29 2022 13:12:58 GMT+0530 (IST)

Rumors On Hemachandra and Shravan Bhargavi divorce

గత వారం పది రోజులుగా సోషల్ మీడియా.. వెబ్ మీడియా.. ఎలక్ట్రానిక్ మీడియా ఇలా అన్ని మీడియాలో కూడా ప్రముఖ నేపథ్య గాయకుడు హేమచంద్ర మరియు నేపథ్య గాయని శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోతున్నారు... ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఇద్దరు చాలా కాలంగానే విడి విడిగా ఉంటున్నారు. ఇప్పుడు అధికారికంగా విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యారు అనేది ఆ వార్తల సారాంశం.మొదట కొందరు పేర్లు చెప్పకుండా భార్య భర్తలు అయిన సింగర్ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కథనాలు మొదలు అయ్యాయి. అవి కాస్త రోజు రోజుకు విస్తరించి అన్నట్లుగా డైరెక్ట్ పేర్లు చెప్పి.. వారు కారణం వీరు కారణం అన్నట్లుగా ఊహాగానాలు చేస్తూ హేమ చంద్ర మరియు శ్రావణ భార్గవి విడి పోయినట్లే అన్నట్లుగా చాలా మంది కథనాలు రాసేశారు.

ఇన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి.. ఇంతగా హడావుడి జరుగుతున్నా కూడా హేమ చంద్ర కాని శ్రావణ భార్గవి కాని ఏదో ఒక మార్గం ద్వారా స్పందించక పోవడంతో అంతా కూడా నిజంగానే ఇద్దరు విడిపోవాలి అనుకుంటున్నారు అన్నట్లుగా మరింతగా ప్రచారం జరగడం మొదలు అయ్యింది.

ఎట్టకేలకు హేమ చంద్ర మరియు శ్రావణ భార్గవి స్పందిచారు. తాము విడి పోవడానికి సిద్దం అయ్యాము అంటూ వార్తలు వచ్చినప్పటి నుండి నా ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ పెరిగారు.. యూట్యూబ్ లో వ్యూస్ పెరిగాయి.. మంచో చెడో కాని మీడియా లో కథనాల వల్ల మాకు ప్రయోజనం చేకూరింది అందుకే కాస్త సైలెంట్ గా ఉన్నాను అన్నట్లుగా శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇక హేమ చంద్ర కూడా స్పందిస్తూ.. ఇలాంటి పుకార్లు తన పాట కంటే ఎక్కువ గా స్పీడ్ గా విస్తరిస్తూ ఉంటాయి. కాని ఆ పుకార్లు నిజం కాదు. మేము కలిసే ఉన్నాం అన్నట్లుగా ఒక సందేశం ను హేమ చంద్ర ఇన్ స్టా ద్వారా షేర్ చేశాడు. మొత్తానికి వీరిద్దరు కలిసి కాకుండా విడి విడిగానే పోస్ట్ లు పెట్టి తాము విడిపోలేదు అంటూ ప్రకటించడంతో హడావుడి కాస్త తగ్గినట్లు అయ్యింది.

కొందరు మాత్రం ఇంకా నమ్మడానికి లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు పెద్దల రాజీ ప్రయత్నాలు సఫలం అయ్యి ఉంటాయి. అందుకే పాప కోసం ఇద్దరు కూడా మళ్లీ కలిసి పోయే ఆలోచన చేసి ఉంటారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి హేమ చంద్ర.. శ్రావణ భార్గవి విడాకుల ఎపిసోడ్ కు ముగింపు పలికినట్లేనా అనేది మరి కొన్ని రోజులు అయితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.