Begin typing your search above and press return to search.

'పవర్ స్టార్' లోని రొమాంటిక్ యాంగిల్...!

By:  Tupaki Desk   |   11 July 2020 6:17 PM GMT
పవర్ స్టార్ లోని రొమాంటిక్ యాంగిల్...!
X
కాంట్రావర్సీకి కేరాఫ్ అడ్రెస్స్ అయిన రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా కాంట్రావర్సీ అయ్యేలా చేస్తాడు. ఒక ట్వీట్ చేసినా ఒక కామెంట్ చేసినా ఒక సినిమా తీసినా దానితో ఏదొక వివాదం చెలరేగేలా చేస్తాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా సినిమా మేకర్స్ అందరూ సైలెంట్ గా ఇంటికే పరిమితమైతే ఆర్జీవీ మాత్రం కరోనా నాకోసమే వచ్చింది అన్నట్లు వరుస పెట్టి సినిమాలు ప్రకటించేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు సినిమాలు కూడా రిలీజ్ చేసాడు. నా సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్స్ రీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదనే విధంగా సొంతంగా 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' అనే ఏటీటీ స్టార్ట్ చేసి తన సినిమాలన్నీ ఇక్కడే విడుదల అవుతాయని చెప్పుకొచ్చాడు. వెబ్ కంటెంట్ కి సెన్సార్ కూడా లేకపోవడంతో రెచ్చిపోయిన వర్మ 'క్లైమాక్స్' 'నగ్నం' లాంటి సినిమాలను వదిలాడు. ఇదే క్రమంలో 'కరోనా' 'మర్డర్' అనే సినిమాలు అనౌన్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' అనే సినిమా తీస్తున్నానని వెల్లడించి సంచలనం రేపాడు.

వర్మ ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీని పరోక్షంగా ట్వీట్స్ పెడుతూ కామెంట్స్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా సైలెంటుగా ఉన్న వర్మ ఈసారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే 'పవర్ స్టార్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి టైటిల్ లోగోలో జనసేన పార్టీ సింబల్ పెట్టాడు. ఇక అప్పటి నుండి డైలీ 'పవర్ స్టార్' స్టిల్స్ సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ రచ్చ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ - చిరంజీవిలను పోలి ఉండే వ్యక్తులను పెట్టి సినిమా తీస్తూ.. ఈ సినిమా నిజ జీవితంలోని ఏ వ్యక్తిని ఉద్దేశించి తీస్తుంది కాదని.. పొలిటికల్ పార్టీ స్థాపించి ఎన్నికలలో ఓడిపోయిన ఓ స్టార్ హీరో స్టోరీ అని.. ఏ వ్యక్తికైనా దగ్గర పోలికలు ఉంటే అది యాదృచ్చికంగా జరిగింది మాత్రమేనని చెప్తున్నాడు. ఇదంతా నిజమని ఆ లార్డ్ బాలాజీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా అంటున్నాడు.

అంతేకాకుండా పవర్ స్టార్ ప్రధాన పాత్రధారి పుస్తకాలు చదవడం.. వ్యవసాయం చేయడం.. గడ్డి కోయడం.. గేదెలకు గడ్డి వేయడం లాంటి స్టిల్స్ వదిలారు. ఇక ఓ డైరెక్టర్‌ ను లాగి పెట్టి కొట్టినట్టు ఓ ఫోటో రిలీజ్ చేసాడు. ఇక 'పవర్ స్టార్ నుండి పవర్ రొమాంటిక్ పోస్టర్' అంటూ ఓ విదేశీ మహిళతో హీరో కూర్చొని ఉన్న ఫొటోనూ వదిలాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఓ రష్యన్ యువతి కూడా ఉండబోతోందని ప్రకటించాడు. దీంతో 'పవర్ స్టార్' సినిమాలో హీరోతో రొమాన్స్ చేయబోయే యువతి తనే అని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. ముందు ముందు వర్మ ఎలాంటి స్టిల్స్ రిలీజ్ చేస్తాడో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.