బాలీవుడ్ కి డీఎస్పీ జంప్..అంతా గ్యాస్!

Sun Dec 04 2022 13:00:02 GMT+0530 (India Standard Time)

Rock star Devi Sri Prasad Going to Bollywood?

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయని చాలా కాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా థమన్..గోపీ సుందర్ లాంటి వాళ్లు  స్పీడప్ అవ్వడంతో డీఎస్పీ పై కొంత ప్రభావం పడిందని ఎప్పటికప్పుడు మీడియా కథనాలు హీటెక్కిస్తున్నాయి. స్టార్ హీరోలసినిమాలన్నింటికి థమన్ వరుసగా సంగీతం అందించడంతో దేవి వేగం తగ్గినట్లు కనిపించింది.కేవలం వేగం మాత్రమే తగ్గింది. అవకాశాలు లేకుండా కనుమరుగవ్వలేదు. ఈ నేపథ్యంలో దేవి శ్రీ బాలీవుడ్ పై దృష్టిసారించినట్లు ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో సరిగ్గా  హిందీలో  రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న 'సిర్కస్' చిత్రానికి పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో దేవి నిజంగానే బాలీవుడ్ కి వెళ్లిపోతున్నాడా? అని మరిన్ని కథనాలు వెలువడ్డాయి.

'వాల్తేరు వీరయ్య ' లాంటి సినిమాలు డీఎస్పీ చేతిలో ఉన్న పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అందుకే  బాస్ పార్టీ సాంగ్ విషయంలో అంత ఎఫెర్ట్ పెట్టలేదని వార్తలొచ్చాయి. అయితే  ఈపాట ఓ సెక్షన్ శ్రోతల్ని బాగానే మెప్పించింది. దీంతో 'వాల్తేరు వీరయ్య' కంటే హిందీ సినిమాపైనే మనసు పెట్టి పనిచేసాడని దేవి సైతం  ట్రోలింగ్ కి  గురయ్యాడు. ఓసారి  వాస్తవంలోకి  వెళ్తే..

టీ-సిరీస్ మ్యూజిక్ దర్శకుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒక సినిమాకి ఎప్పుడు ఒకే మ్యూజిక్ డైరెక్టర్  ఎంపిక చేయదు. ఆ సంస్థలో ఒకే సినిమాకి ఇద్దరు ..ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తారు.   సిర్కస్ చిత్రానికి డీఎస్పీ ఒక్కడే పనిచేయలేదు.  డిఎస్పితో పాటు.. లిజో జార్జ్ మరియు డిజె చేతాస్  సంగీతం అందించారు.  

బ్యాగ్రౌండ్ స్కోర్ మరొకరు కంపోజ్ చేసారు.  ఈ సినిమాకి  దేవి శ్రీ ప్రసాద్  కేవలం రెండు పాటలు మాత్రమే అందించారు. బ్యాలెన్స్ పాటలు  మొత్తం మిగిలిన ఇద్దరు కంపోజ్ చేసారు.  కాబట్టి డీఎస్పీ బాలీవుడ్ ప్రాజెక్ట్లపై మాత్రమే దృష్టి పెడుతున్నాడని బలంగా చెప్పడానికి వీలు లేదు.

ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ పాన్ ఇండియా చిత్రం పుష్ప-2కి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడిగా చాలా కాలంగా పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళికి- కీరవాణి ఎలాగో..లెక్కలు మాష్టారుకి -దేవి శ్రీ అలా నమ్మిన బంటు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.