Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: 39 వ జన్మదినం.. అయినా హాటు!

By:  Tupaki Desk   |   24 Jan 2020 1:38 PM GMT
ఫోటో స్టోరీ: 39 వ జన్మదినం.. అయినా హాటు!
X
ఈ దేశంలో ఎంతో మంది హాటు బ్యూటీలు. వారిలో ఒక హాటీ రియా సేన్. ఈరోజే ఈ భామ తన 39 వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ భామ ఎవరంటే సుచిత్రా సేన్ మనవరాలు. మూన్ మూన్ సేన్ కూతురు. 16 ఏళ్ళ వయసులోనే ఫల్గుణి పాఠక్ సూపర్ హిట్ వీడియో సాంగ్ 'యాద్ పియా కి ఆనే లగీ' లో డ్యాన్స్ చేసింది. అటు బాలీవుడ్ సినిమాలు ఇటు సౌత్ సినిమాల్లో నటిస్తూ సామాజిక న్యాయం పాటించింది. రియా రియల్ గా బెంగాలి భామ కాబట్టి ఎన్నో బెంగాలి సినిమాల్లో కూడా నటించింది. టాలీవుడ్ లో మంచు మనోజ్ సినిమా 'నేను మీకు తెలుసా' లో రియా హీరోయిన్ గా నటించింది.

సహజంగా వయసు పెరిగేకొద్ది అందం తగ్గిపోయింది. కానీ ఈ భామ విషయంలో అదేంటో రివర్స్ లో జరుగుతోంది. వయసుతో పాటుగా అందం పెరుగుతోంది. ఇక సోషల్ మీడియాను తన హాట్ ఫోటోలతో బికినీలతో రఫ్ఫాడిస్తుంది. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఘాటు ఫోటో పోస్ట్ చేసి మరీ అభిమానులకు కానుకనిచ్చింది. ఈ ఫోటోనే కాదు ఏ ఫోటో అయినా.. అసలు రియా ఫోటో షూట్ చేసిందంటే చాలు వాతావరణం వేడెక్కినట్టే. రియా జన్మదినం సందర్భంగా పాత హాట్ ఫోటోలను షేర్ చేసి మరీ లైక్స్ కొడుతున్నారు నెటిజన్లు. ఒక ఫోటోలో కొబ్బరి చెట్టు దగ్గర మోనోకినిలో నిలుచుని ఉంటే మరో ఫోటోలో పూల్ లో ఒంపులు తిరిగి ఉన్న బ్యాక్ ఎండ్ టెక్నాలజీని చూపించింది. ఇంకో ఫోటోలో డీ...ప్ వీనెక్ ధరించి అందాలను వడ్డించింది.

బికినీల వయ్యారం కూడా తక్కువేమీ కాదు. కలర్ ఫుల్ బికినీలు ధరించి రియా ఎన్నోసార్లు కెమెరాలకు పట్టిన తుప్పును వదిలించింది. నెటిజన్లకు నిద్రలేకుండా చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే రియాకు ప్రస్తుతం చేతిలో ఆఫర్లేవీ లేవు. అయితే పోయినేడాది మాత్రం 'పాయిజన్'.. 'మిస్ మ్యాచ్ 2' అనే వెబ్ సీరీస్ లో నటించింది.