Begin typing your search above and press return to search.

జిమ్ లో హాట్ ఫైటర్ గా మెరిసిపోతున్న రితికా సింగ్

By:  Tupaki Desk   |   30 Jan 2023 5:00 AM GMT
జిమ్ లో హాట్ ఫైటర్ గా మెరిసిపోతున్న రితికా సింగ్
X
టాలీవుడ్ లో గురు సినిమాలో నటించి ప్రేక్షకులకి రీచ్ అయిన అందాలభామ రితికా సింగ్. ఈ అమ్మడు తరువాత నీవెవరో అనే సినిమాలో ఆది పినిశెట్టికి జోడీగా నటించింది. రెండో సినిమా ఆశించిన స్థాయిలో హిట్ ఇవ్వలేదు. అయితే ఈ బ్యూటీకి సౌత్ లో మంచి పాపులారిటీ ఉంది. గురు ఒరిజినల్ వెర్సన్ అయిన సాలా ఖడూస్ అనే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అందుకు ముందు ఈ అమ్మడు మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంది. ఆమె నాలుగు నాక్ అవుట్ ఈవెంట్స్ లో పాల్గొని ఒకదాంట్లో గెలిచింది.

అలాగే నేషనల్ మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ గా ఉండేది. బాక్సింగ్ నేపధ్యం కథతో సుందా కొంగర తెరకెక్కించిన సాలా ఖడూస్ సినిమా కోసం ఈమెని లీడ్ రోల్ కి ఎంపిక చేశారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రితికా సింగ్ ఇక నటిగా కెరియర్ ని ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. ఈ అమ్మడు ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కింగ్ ఆఫ్ కోటాలో నటిస్తుంది. దాంతో పాటు లారెన్స్ కి జోడీగా ఒక హర్రర్ సినిమాలో నటిస్తుంది. బాక్సర్ అనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసింది అలాగే తమిళ్ లో పిచ్చకారన్ 2 మూవీ కూడా కంప్లీట్ చేసింది.

ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తున్న రెగ్యులర్ వర్క్ అవుట్స్ మాత్రం చేస్తుంది. అలాగే తనలోని అందాలని చూపించడానికి ఇన్స్టాగ్రామ్ ని వేదికగా మార్చుకుంది. మంచి ఫిట్ నెస్ తో కనిపించే ఈ అమ్మడు హాట్ డ్రెస్సులతో లో కూడా కాన్ఫిడెంట్ లుక్ తో ఒక ఫైటర్ తరహాలోనే కనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో జిమ్ లో వర్క్ అవుట్ చేసిన లుక్ లో హాట్ ఫైటర్ గా కనిపిస్తూ కనువిందు చేసింది. ఈ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది.

అలాగే ఆ లుక్ లో నిజమైన ఫైటర్ లానే రితికా సింగ్ ఉందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ అయినా కూడా తనకి ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ని రితికా వదులుకోవడం లేదు. ఆమె డే మార్షల్ ఆర్ట్స్ కిక్స్ ప్రాక్టీస్ తోనే స్టార్ట్ అవుతుంది అని ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తుంటే తెలుస్తుంది. ఈమెకి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సరైన కథ పడితే ఫిమేల్ హీరో సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోతుందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. చాలా మంది సినిమాలలో యాక్షన్ హీరోయిన్స్ గా రాణించారు. అలాంటి ఒక్క ఛాన్స్ పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రితికా సింగ్ రెడీగా ఉందని ఆమె లుక్స్, ఫిట్ నెస్ చూస్తుంటే అర్ధమవుతుంది.