వచ్చింది ‘కాంతార 2’.. త్వరలో రాబోతుంది ‘కాంతార 1’

Mon Feb 06 2023 12:00:01 GMT+0530 (India Standard Time)

Rishabh Shetty clarified that Kantara will come again

గత ఏడాది కన్నడ సినిమా ఇండస్ట్రీ వచ్చిన 'కాంతార' ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా కాంతార కలెక్షన్స్ లో ప్రభంజనం సృష్టించింది. రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.కాంతార సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా రాబట్టి అందరిని ఆశ్చర్యపర్చింది.

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. కేజీఎఫ్ 2 కంటే కూడా అత్యధిక జనాలు చూసిన సినిమాగా కాంతార కర్ణాటకలో రికార్డును సొంతం చేసుకుంది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందని.. వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కాంతార మళ్లీ రాబోతుంది అంటూ స్పష్టం చేశాడు.

అయితే మీరు గత ఏడాది చూసింది కాంతార 2 సినిమా కాగా.. ప్రస్తుతం కాంతార 1 కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఆయన మాటలను బట్టి కాంతార సినిమాకు సీక్వెల్ కాకుండా ప్రీ క్వెల్ రూపొందుతున్నట్లుగా అనిపిస్తుంది. కాంతార సినిమా కు ముందు జరిగే కథ ను కొత్త కాంతారలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

గత ఏడాది వచ్చిన కాంతార చిన్న బడ్జెట్ సినిమా కాగా.. ప్రస్తుతం చేయబోతున్న కాంతార సినిమా భారీ బడ్జెట్ మూవీ అంటూ కన్నడ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.