ఆ సీక్వెల్ కోసం మైండ్ బ్లాక్ రెమ్యునరేషన్..!

Fri Mar 24 2023 11:39:18 GMT+0530 (India Standard Time)

Rishab Shetty Remuneration For Kantara 2

కన్నడలో కె.జి.ఎఫ్ చాప్టర్ 1 2 ఎన్ని రికార్డులు సృష్టించిందో ఆ తర్వాత అదే రేంజ్ రికార్డులతో రచ్చ చేసిన సినిమా కాంతార. రిషన్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 20 కోట్ల బడ్జెట్ తో తీస్తే 400 కోట్ల వసూళ్లను రాబట్టింది. కాంతార సినిమాకు రిషబ్ శెట్టి 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కాంతార సెన్సేషనల్ హిట్ అవడంతో సీక్వెల్ కి తన రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు. కాంతార సినిమా నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. అందుకే ఈ సీక్వెల్ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.రీసెంట్ గానే సీక్వెల్ స్క్రిప్ట్ మొదలు పెట్టిన రిషబ్ శెట్టి కాంతారా 2 కోసం బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కాంతార 1 కి కేవలం ఐదు కోట్లు తీసుకున్న రిషబ్ ఆ రెమ్యునరేషన్ లోనే డైరెక్షన్ హీరోగా చేశాడు. కానీ కాంతార 2 కోసం మాత్రం అతను భారీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం కాంతారా 2 కోసం రిషబ్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.

అయితే ఇందులో 50 కోట్లు రెమ్యునరేషన్ లాగా.. మరో 50 కోట్లు బిజినెస్ లో షేర్ లాగా తీసుకుంటున్నాడట. ఎలా చూసినా సరే రిషబ్ శెట్టికి ఈ సీక్వెల్ తో 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ వస్తున్నట్టు తెలుస్తుంది. కాంతారా 2 మీద ఆడియన్స్ అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే వారు ఎన్ని అంచనాలతో వచ్చినా వాటికి మించి ఈ సినిమా ఉంటుందని అంటున్నారు చిత్రయూనిట్.

ఈసారి బడ్జెట్ కూడా భారీగా పెడుతున్నారు కాబట్టి సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందని అంటున్నారు. కాంతారా 2 రిలీజ్ కూడా గ్రాండ్ గా ఉండబోతుంది. కాంతార 1 ని అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు కాంతారా 2ని కూడా ఆయనే భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.