మెగా అల్లుడిని మధ్యలో వదిలేసిన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్...?

Mon Jul 06 2020 08:00:01 GMT+0530 (IST)

Rhea Chakraborthy Shocked To Kalyan Dhev

మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మరో హీరో కళ్యాణ్ దేవ్. 'విజేత' సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన కళ్యాణ్ దేవ్.. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో కళ్యాణ్ దేవ్ తన రెండవ చిత్రంగా 'సూపర్ మచ్చి' చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో రచితా రామ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ దేవ్ సెట్ లో తీసుకున్న జాగ్రత్తలు.. 'సూపర్ మచ్చీ' చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.కళ్యాణ్ మాట్లాడుతూ.. 'సూపర్ మచ్చి' లో బయటకు రఫ్ గా ఉంటూ లోపల సెన్సిటివ్ గా ఉండే పాత్ర నాది. బార్ లో పని చేసే సింగర్ గా నటిస్తున్నాను. ఇంకా ఒక సాంగ్ రెండు రోజుల టాకీపార్టు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. షూటింగ్ లో పాల్గొనడానికి అందరూ ధైర్యం చేయడం లేదు. అందుకే మిగిలిన ఆర్టిస్టులు కాల్షీట్లు చూసుకొని మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నాం. నేను ఇంత ధైర్యంగా షూటింగ్ లో పాల్గొనడానికి మా సినిమా నిర్మాతలు ముఖ్య కారణం. వారికి ఆర్థికపరమైన సమస్యలు రాకూడదని భావించాను. నిర్మాతల ఇబ్బందులను మనం అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ''నేను షూటింగ్ లో పాల్గొనడం గురించి మామయ్యతో మాట్లాడాను. 'ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ చేయాలి కదా. నీకు ఓకే అనుకుంటే షూటింగ్ కి వెళ్లు' అని అన్నారు. అలాగే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో మామయ్య చెప్పారు'' అని చెప్పారు.

అంతేకాకుండా బయటికి వెళ్లి షూటింగ్ చేస్తాం కాబట్టి సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని డిసైడ్ అయ్యాను.. ఒక ప్రత్యేక గదిలో ఉంటూ నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. టైమ్ పాస్ కోసం బుక్స్ ఇంటర్ నెట్ ఉన్నాయి. షూటింగ్ కి వెళ్లడం స్టార్ట్ చేశాక నా పిల్లలకు దూరంగా ఉంటున్నాను. మా ఫస్ట్ డాటర్ బర్త్ డేకి నేను ఇంట్లోనే ఉంటూ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోవడం బాధగా ఉందని పేర్కొన్నాడు. ఇక తన సినిమాల గురించి మామయ్యతో చర్చిస్తుంటానని.. ఆయనకు ఉన్న అనుభవంతో కొన్ని సలహాలు చెబుతారని.. అయితే 'సూపర్ మచ్చి' స్క్రిప్ట్ ను మామయ్య వినలేదని కళ్యాణ్ వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమాలో మొదట రియా చక్రవర్తిని హీరోయిన్ గా తీసుకున్నామని.. కొన్ని రోజులు షూటింగ్ చేశాక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సినిమా ఉందంటూ మధ్యలోనే వెళ్లిపోయిందని కల్యాణ్ దేవ్ చెప్పుకొచ్చాడట. ఆ తర్వాత కన్నడ హీరోయిన్ రచితా రామ్ ను తీసుకుని రీషూట్ చేసినట్టు కళ్యాణ్ వెల్లడించారట. కాగా ప్రస్తుతం శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయని త్వరలో ఆ వివరాలు చెబుతానని చెప్పుకొచ్చారు.