Begin typing your search above and press return to search.

దేశంలో అత్యాచారాలు జ‌రుగుతుంటే మీ ఫోక‌స్ ఇదా - రేణు ఫైర్‌

By:  Tupaki Desk   |   30 Sep 2020 4:00 PM GMT
దేశంలో అత్యాచారాలు జ‌రుగుతుంటే మీ ఫోక‌స్ ఇదా - రేణు ఫైర్‌
X
ప‌వ‌ర్ ‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మీడియాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దేశంలో అత్యాచారాలు జ‌రుగుతుంటే మీడియా మాత్రం ఆ సంఘ‌ట‌న‌ల‌పై ఫోక‌స్ పెట్ట‌డం లేద‌ని,.. అలాంటి వార్త‌ల్ని పెద్ద‌గా ప్ట‌ట్టించుకోవ‌డం లేద‌ని మండి ప‌డింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్ప‌ద మృతి, .. ఆ త‌రువాత రియా ద్వారా డ్ర‌గ్స్ వెలుగులోకి రావ‌డంతో జాతీయ మీడియా ఈ వార్త‌ల‌పైనే గ‌త 40 రోజుల‌కు పైగా ప్ర‌త్యేక దృష్టిని పెట్ట‌డంపై రేణు దేశాయ్ మండి ప‌డ్డారు. దేశంలో అత్యాచారాలు జ‌రుగుతుంటే మీ ఫోక‌స్ ఇదా అని రేణు ఫైర్ అయ్యారు.

ఇటీవ‌ల ఉత్త‌రప్ర‌దేశ్‌ లో 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసి ఆ త‌రువాత అతి దారుణంగా హ‌త్య చేశారు. దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన ఈ ఘ‌ట‌న‌ని మీడియా అస్స‌లు ప‌ట్టించుకోలేదు. ఏదో న్యూస్ వేశామా అంటే వేశాం అన్న‌ట్టుగా వ‌దిలేసింది. దీంతో నెటిజ‌న్స్ మీడియాపై తీవ్ర స్థాయిలో మండి ప‌డుతున్నారు. రేణు దేశాయ్ కూడా ఈ విష‌యంలో తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. సుశాంత్ కేసు విష‌యంలో అత్యుత్సాహం చూపిస్తున్న మీడియాకు ఆ దారుణం క‌నిపించ‌లేదా? అని మండిప‌డింది.

ఒక అమ్మాయిని దారుణంగా చంపేస్తే మీడియా ప‌ట్టించుకోలేద‌ని, ..క‌నీసం ఓ వార్త‌ని కూడా క‌వ‌ర్ చేయ‌లేద‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌ లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో మ‌నీషా వాల్మీకి అత్యంత దారుణ హ‌త్య‌కు గురైంది. ఆమెకు న్యాయం చేయాలంటూ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో మ‌ద్ద‌తుగా నిలిచారు.