Begin typing your search above and press return to search.

ఆ సినిమాల రీమేక్ కాస్త కష్టం.. ఇప్పటికైనా అర్థం అయ్యిందా!

By:  Tupaki Desk   |   8 Feb 2023 5:00 AM GMT
ఆ సినిమాల రీమేక్ కాస్త కష్టం.. ఇప్పటికైనా అర్థం అయ్యిందా!
X
కంటెంట్ ఓరియంటెడ్‌ సినిమాలు తీయడంలో మలయాళ సినీ ఇండస్ట్రీ తర్వాతే మరే ఇండస్ట్రీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా మలయాళ సినిమాలకు మంచి డిమాండ్ మరియు క్రేజ్ ఉంటుంది. అందుకే మలయాళంలో విడుదల అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకున్న దాదాపు సగం సినిమాలు ఏదో ఒక భాషలో రీమేక్‌ అవుతున్నాయి.

సౌత్‌ లోని ఇతర భాషలతో పాటు హిందీలో ఎక్కువగా మలయాళ సినిమాలు రీమేక్ అయ్యాయి.. ప్రస్తుతం అవుతున్నాయి.. భవిష్యత్తులో అవుతాయి కూడా. అయితే ఎక్కువ శాతం మలయాళ సినిమాల యొక్క రీమేక్ లు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చుతున్నాయి. ఒరిజినల్ వర్షన్ ను మక్కీకి మక్కీ అన్నట్లుగా రీమేక్ చేసినా కూడా విఫలం అవుతున్నాయి.

ఒరిజినల్‌ వర్షన్ లో ఉండే ఎమోషన్స్ ను రీమేక్ లో కాపీ చేయడంలో నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు విఫలం అవుతున్నారు.

కథ.. స్క్రీన్‌ ప్లే ఇతర విషయాలను కాపీ చేసినా కూడా కొన్ని కీలకమైన ఎమోషన్స్ విషయంలో మాత్రం రీమేకర్స్ నిరాశ పర్చుతున్నారు.

ఉదాహరణకు ఇటీవల తెలుగు లో వచ్చిన బుట్ట బొమ్మ సినిమా ఉట్టి బొమ్మ అన్నట్లుగా విమర్శలు ఎదుర్కొంది. మలయాళంలో సూపర్‌ హిట్ అయిన కప్పెల సినిమాకు బుట్టబొమ్మ రీమేక్ అనే విషయం తెల్సిందే. 90 శాతం వరకు ఉన్నది ఉన్నట్లుగా బుట్ట బొమ్మ ను రూపొందించినా కూడా ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే మలయాళ సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యి నిరాశ పర్చుతున్నాయి. మలయాళ సినిమాల్లో ఎమోషన్స్ కాస్త ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని రీమేక్ లో కంటిన్యూ చేయకపోతే ఫలితం నిరాశే. రీమేక్‌ ల్లో 90 శాతం ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ముందు ముందు మలయాళ సినిమాలను రీమేక్ చేయాలంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.