Begin typing your search above and press return to search.

ఈ వారం బిగ్ స్క్రీన్, ఒటీటీలో రిలీజ్ కాబోయేవి ఇవే

By:  Tupaki Desk   |   30 May 2023 9:44 AM GMT
ఈ వారం బిగ్ స్క్రీన్, ఒటీటీలో రిలీజ్ కాబోయేవి ఇవే
X
ప్రతి నెల పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా కావాల్సినంత ఎంటర్టైన్ మెంట్ ప్రేక్షకులకి అందుతోంది. బిగ్ స్క్రీన్ పై వచ్చే సినిమాలు తక్కువే ఉన్న ఒటీటీటీ కంటెంట్ విపరీతంగా రిలీజ్ అవుతోంది.

అన్ని భాషలలో ప్రేక్షకులని అలరించే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకి ఒటీటీ మాధ్యమాల ద్వారా వస్తున్నాయి. అలాగే బిగ్ స్క్రీన్ పైన కూడా చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు వస్తున్నాయి. జూన్ మొదటి వారంలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు, ఒటీటీలో అలరించబోయే మూవీస్, వెబ్ సిరీస్ లు ఏంటి అనేది చూసుకుంటే.

జూన్ 2న తేజ దర్శకత్వంలో ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న అహింస మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావడం, మరల ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడంవలన ఈ మూవీపై మంచి బజ్ అయితే ఉంది.

ఇక బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ బాబు హీరోగా వస్తోన్న రెండో సినిమా నేను స్టూడెంట్ సార్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్టూడెంట్, పోలీస్ మధ్య ఆధిపత్య పోరుగా ఈ మూవీ కాన్సెప్ట్ ఉంది. ఈ చిత్రం జూన్ 2న రిలీజ్ అవుతోంది. ట్రైలర్ తో ఈ సినిమా మంచి అంచనాలు క్రియేట్ చేసింది. సముద్రఖని ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ గా కనిపిస్తున్నాడు.

అలాగే ఐక్యూ అనే సినిమా కూడా జూన్ 2న రిలీజ్ కాబోతోంది.వీటితో పాటు సురేష్ ప్రొడక్షన్ లో రానా నిర్మించిన పరేషాన్ మూవీ జూన్ 2న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో మసూదలో లీడ్ రోల్ చేసిన తిరువీర్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే అజయ్ మెయిన్ లీడ్ గా చక్ర వ్యూహం అనే మూవీ కూడా జూన్ 2న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.


అమెజాన్ ప్రైమ్

తెలుగు మూవీ బ్యాక్ డోర్ జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

జీ5:

విశ్వక్ అనే తెలుగు మూవీ జూన్ 2 నుంచి టెలికాస్ట్ కాబోతోంది.


జియో సినిమా:

బాలీవుడ్ వెబ్ సిరీస్ అసుర్ సీజన్ 2 – జూన్ 1న

బాలీవుడ్ మూవీ ముంబైకర్ జూన్ 2న రిలీజ్ అవుతున్నాయి.


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:


బాలీవుడ్ వెబ్ సిరీస్ స్కూల్ ఆఫ్ లైస్ జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.


నెట్‌ఫ్లిక్స్:


హాలీవుడ్ వెబ్ సిరీస్ ఫేక్ ప్రొఫైల్ మే 31 నుంచి.


జూన్ 1 నుంచి

హాలీవుడ్ మూవీ ఏ బ్యూటీఫుల్ లైఫ్

హాలీవుడ్ వెబ్ సిరీస్ న్యూ ఆమ్‌స్టర్ డ్యామ్

హాలీవుడ్ మూవీ ఇన్ఫినిటీ స్టోర్మ్ రిలీజ్ కాబోతున్నాయి.

జూన్ 2న హాలీవుడ్ వెబ్ సిరీస్ మేనిఫెస్ట్ సీజన్ 4 పార్ట్ 2

బాలీవుడ్ వెబ్ సిరీస్ స్కూప్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.