ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కు కోర్టులో ఊరట

Tue Jul 27 2021 08:00:01 GMT+0530 (IST)

Relaxation In Court For Bollywood Actress

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరియు ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ల మద్య గత కొన్నాళ్లుగా న్యాయ పోరాటం కొనసాగుతుంది. సుశాంత్ మృతికి సంబంధించిన విషయంలో కంగనా గతంలో మాట్లాడుతూ జావేద్ అక్తర్ పై విమర్శలు చేసింది. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ పరువు నష్టం దావా వేశాడు. ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాకపోవడంతో కంగనా పై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దాంతో ఆమె పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. కాని పాస్ పోర్ట్ రెన్యూవల్ సమయంలో తన పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు అంటూ ఆమె అఫిడవిట్ ను సమర్పించింది.పాస్ట్ పోర్ట్ ఆఫీస్ కు ఆమె తప్పుడు అఫిడవిట్ ఇచ్చిందని.. ఆమె న్యాయ వాద బృందం ఆ పత్రాలను తయారు చేయడం జరిగిందంటూ జావేద్ అక్తర్ కోర్టులో పిటీషన్ వేశాడు. ఆమె తప్పుడు పత్రాలతో పాస్ పోర్టను రెన్యువల్ చేసుకుందని.. అందుకు ఆమె శిక్ష అర్హురాలు అంటూ జావేద్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ విషయంలో కోర్టు నుండి ఎటువంటి వాదనలు వినకుండానే ఈ పిటీషన్ ను స్వీకరించేది లేదు అంటూ తేల్చి చెప్పారు.

ఇలాంటి కేసులు స్వీకరిస్తే పెద్ద మొత్తంలో వస్తాయని.. ఈ కేసును పాస్ పోర్ట్ ఆఫీసర్ వద్దకు తీసుకు వెళ్లాల్సిందిగా కోర్టు సూచించింది. కోర్టు లో ఇలాంటి కేసులను విచారించడం సబబు కాదనే అభిప్రాయంను న్యాయమూర్తి వెళ్లడించడంతో కంగనాకు పెద్ద ఊరట దక్కింది. ఆమె తప్పుడు పత్రాలు సమర్పించినట్లుగా నిరూపితం అయితే పాస్ పోర్ట్ ఆఫీసర్ లు ఆమె పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని.. ఆమెపై కేసు పెట్టడం ఇతర విషయాలు ఏమైనా కూడా వారి పరిధిలో ఉంటుందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.