చిరులో అది నాకు బాగా నచ్చిందంటున్న రెజీనా!

Thu Jul 07 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Regina says I like it very much in chiranjeevi

రెజీనా కసాండ్రా.. తెలుగు తమిళ సినీ ప్రియులకు ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. `శివ మనసులో శృతి` మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన రెజీనా.. `పిల్లా నువ్వు లేని జీవితం` `సుబ్రహ్మణ్యం ఫర్ సేల్` లాంటి చిత్రాల ద్వారా టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ దక్కించుకుంది.మరోవైపు కోలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ `అన్యాస్ ట్యుటోరియల్` అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది.

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ కు చక్కటి స్పందన లభిస్తోంది. ఇకపోతే రెజీనా తాజాగా పాపులర్ టీవీ షో `ఆలీతో సరదాగా`లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలను సైతం అందరితోనూ షేర్ చేసుకుంది.

అయితే ఈ క్రమంలోనే హోస్ట్ ఆలీ `ఆచార్య సినిమాలో మెగా స్టార్ చిరంజీవి గారితో కలిసి పని చేయడం ఎలా అనిపించింది..?` అని ప్రశ్నించాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమే `ఆచార్య`. ఇందులో `సానా కష్టం` అనే స్పెషల్ సాంగ్ లో రెజీనా చిరుతో కలిసి చిందులేసింది.

ఈ నేపథ్యంలోనే ఆలీ చిరుతో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ప్రశ్నించగా.. రెజీనా బదులిస్తూ `ఈ వయసులోనూ చిరంజీవి గారు ఏ విషయాన్ని అయినా.. చాలా త్వరగా నేర్చుకుంటారు. అది నాకు బాగా నచ్చింది. ఆ విషయంలో ఆయనను మెచ్చుకోవాల్సిందే. ఆయనతో కలిసి వర్క్ చేయడం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా రెజీనా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ  తెలుగు తమిళ భాషల్లో `నేనే నా` అనే చిత్రం చేస్తోంది. తెలుగులో `శాకినీ ఢాకినీ` అనే మూవీతో పాటు తమిళంలో ఓ మూడు ప్రాజెక్స్ట్ ను టేకప్ చేసింది. అలాగే మరోవైపు బాలీవుడ్ లో `షూర్ వీర్` వెబ్ సిరీస్ లో నటిస్తోంది. కనిష్క్ వర్మ ఈ సిరీస్ ను రూపొందించారు. ఇటీవల బయటకు వచ్చిన ఈ సిరీస్ ట్రైలర్ మంచి ఆదరణ దక్కించుకుంది.  జూలై 15 నుంచి హాట్ స్టార్ లో ఈ సిరీస్  స్ట్రీమింగ్ కాబోతోంది.