Begin typing your search above and press return to search.

నీటి పై తేలుతున్న చెన్నై బ్యూటీని చూస్తే గాల్లో తేలాల్సిందే..!

By:  Tupaki Desk   |   4 Aug 2020 11:30 PM GMT
నీటి పై తేలుతున్న చెన్నై బ్యూటీని చూస్తే గాల్లో తేలాల్సిందే..!
X
రెజినా కెసెండ్రా.. టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ భామ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదటగా తమిళంలోనే హీరోయినుగా అరంగేట్రం చేసింది. తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎస్ఎంఎస్ సినిమాతో తెలుగులో తన సినీ కెరీర్ ప్రారంభించింది. ఇక ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో మంచి ఫామ్ కంటిన్యూ చేసింది రెజినా. కెరీర్ ఫస్ట్ నుండి గ్లామర్ షోకి వెనుకాడని రెజినా.. నక్షత్రం, మిస్టర్ చంద్రమౌళి సినిమాలలో విపరీతంగా అందాలను ఆరబోసింది. సినిమాలలో తన గ్లామర్ ద్వారా లక్షలాది అభిమానులను సంపాదించుకొని ఎల్లప్పుడూ కుర్రాళ్లను మరిపించే ఫోటోషూట్లతో అలరిస్తుంది.

ఈ మధ్య కెరీర్లో కాస్త స్పీడ్ తగ్గించిన రెజినా.. ఇటీవలే చిరంజీవి 'ఆచార్య' సినిమా ఐటమ్ సాంగ్ లో చిందేసిందని టాక్ వినిపిస్తుంది. ఇక సినిమా అవకాశాలు తక్కువ ఉండటంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులను విందు పంచడానికి సిద్ధమైంది. ఇటీవలే రెజినా స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి అమ్మడు ఫ్యాన్స్ ఊరుకుంటారా.. నీటిలో చేపలా మిలమిల మెరుస్తున్న రెజినాను చూస్తూ డ్రీమ్స్ లో విహరిస్తున్నారు. తను చల్లని నీటిలో ఉంటూనే కుర్రాళ్లలో వేడి పుట్టిస్తున్న పోజు చూసి కుర్రకారు అల్లాడిపోతున్నారు. నిజానికి అవకాశాలు లేక ఈ బ్యూటీని ఎవరు పట్టించుకోట్లే గాని సరిగ్గా కాన్సంట్రేషన్ చేస్తే రెజినా అందాలు ఇట్టే సెగలు రేపుతోంది. ఏదేమైనా అభిమానులు మాత్రం ఈ పోజులో రెజినా నీటిలో తేలుతుంటే.. చూసిన ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు. ప్రస్తుతం రెజినా చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తుంది.