ఆ విషయంలో నాకు నచ్చితేనే ఓకే చెప్తా - రెజీనా

Sat Jan 23 2021 20:00:01 GMT+0530 (IST)

Regina Cassandra Talking About Bold Scenes

అందంతోపాటు అభినయం కలగలిసిన నటీమణుల్లో రెజీనా ఒకరు. ఇప్పటి వరకూ సరైన మూవీ పడలేదుగానీ.. టాప్ రేంజ్ కు చేరుకునే టాలెంట్ పుష్కలంగా ఉందీ బ్యూటీకి. కేవలం సక్సెస్ వెంట పరుగులు తీసే ఇండస్ట్రీలో.. ఆమెకు ఈ మధ్య అవకాశాలు కూడా తగ్గాయి. అడవి శేషు నటించిన ‘ఎవరు’ సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు ఈ బ్యూటీ.అయితే.. రెజీనా లేటెస్ట్ గా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రమే ‘నేనేనా?’ సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న రెజీనా.. ఈ సినిమాతోనైనా మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తోంది. సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం ద్వారా.. తిరిగి సత్తా చాటాలని చూస్తోంది. కాగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బ్యూటీ.. తన వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎనిమిదేళ్లవుతోందని ఈ సినీ జర్నీలో ఎంతో నేర్చుకున్నాని తెలిపింది. తాను చిత్ర పరిశ్రమలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకండా వచ్చానని చెప్పిన రెజీనా.. తొలినాళ్లలో ఇండస్ట్రీ గురించి సరైన క్లారిటీ రాలేదన్నారు. ఇక్కడ ఎన్నో రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చాలా మంది వాటినే అనుసరిస్తుంటారని తెలిపింది.

అయితే.. తన స్వేచ్ఛకు భంగం కలిగితే మాత్రం దేన్నీ ఖాతరు చేయనని చెప్పందీ బ్యూటీ. ‘నా వ్యక్తిగత స్వేచ్ఛను ఇబ్బంది పెట్టే ఎలాంటి విషయాన్నైనా పట్టించుకోను. నా సొంత నిర్ణయాలతోనే ముందుకుసాగుతా’ అని చెప్పిందీ బ్యూటీ. కథ నచ్చితే వెంటనే సినిమాను ఓకే చేస్తానని ఎవరితోనూ చర్చించి నిర్ణయాలు తీసుకోవడం తనకు నచ్చదని చెప్పుకొచ్చింది. జీవితంలో ఎదురైన సమస్యలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని కెరీర్‌ను తీర్చిదిద్దుకున్నాని చెప్పిన రెజీనా భవిషత్తులోనూ ఇదే విధంగా ముందుకు సాగుతానని చెప్పింది.