Begin typing your search above and press return to search.

తొలి మూవీ బ్లాక్ బస్టర్..సినిమాలకు దూరమైన ఆ నటి ఇప్పుడెలా ఉందంటే.

By:  Tupaki Desk   |   14 Jun 2021 3:30 AM GMT
తొలి మూవీ బ్లాక్ బస్టర్..సినిమాలకు దూరమైన ఆ నటి ఇప్పుడెలా ఉందంటే.
X
ఎంట్రీతోనే అదరగొట్టే హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉంటారు. అందులోకి మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో అలజడి రేపి.. ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకోవటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. తొలి ‘చిత్రం’ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న ఆ నటి ఎవరో కాదు రీమాసేన్. దాదాపు నలభై సినిమాల్లో నటించిన ఆమె.. మిగిలిన హీరోయిన్లకు భిన్నమైనదన్న ముద్రను వేసుకున్నారు.

చిత్రంతో మొదలైన ఆమె ప్రయాణం ‘మనసంతా నువ్వే’ మూవీలో చక్కిలిగింత పెట్టేసింది. అగ్ర నటీమణిగా పేరున్నప్పటికి స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు తక్కువే. అయినప్పటికి ఆమెకు యూత్ లో ప్రత్యేక స్థానం ఉంది. నటించింది నలభై సినిమాలే అయినా.. మూడు ఫిలంఫేర్ అవార్డుల్ని సొంతం చేసుకుంది. తెలుగుతో సరిపెట్టుకోకుండా తమిళం.. హిందీ మూవీలతో బిజీగా ఉన్న వేళలో అనూహ్యంగా సినిమాల నుంచి తప్పుకొని పెళ్లి పీటల మీదకు ఎక్కి అందరిని ఆశ్చర్యపరిచింది.

2012లో బిజినెస్ మ్యాన్ శివకరణ్ తో పెళ్లైన ఆమె.. తర్వాత నుంచి సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేసింది. వివాహమైన ఏడాదికే ఆమె తల్లయ్యారు. కొడుకు పేరు రుద్రవీర్. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీకి దూరంగా బతికేస్తోంది. మరి..ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారు? ఆమె ఫ్యామిలీ ఎలా ఉన్నారన్న దానికి ఈ ఫోటోనే నిదర్శం. పూర్తిగా ఇంటికే పరిమితమైనప్పటికి.. తన గ్లామర్ ను ఇసుమంత మిస్ కాకుండా మొయిటైంన్ చేయటం ఆమె ప్రత్యేకతగా చెప్పాలి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమ ఫోటోల్ని పోస్టు చేస్తూ ఉంటుంది.