ఫోటో స్టోరి: రెడ్ హాట్ మలైకం

Thu Nov 14 2019 18:27:01 GMT+0530 (IST)

Red Hot Malaika Arora

ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని ఫాలో చేయడంలో మలైకా స్పీడ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. బాలీవుడ్ లో ఉన్న మోస్ట్ స్టైలిష్ ఫ్యాషనిస్టాగా తనకు పాపులారిటీ ఉంది. 16 ఏజ్ నుంచి 60 ఏజ్ వరకూ మలైకా స్టైల్స్ గురించి ముచ్చటిస్తారంటే ఏ స్థాయిలో తనకు పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్లో జియాంబట్టిస్టా వల్లి అనే ప్రత్యేకమైన డిజైనర్ డ్రెస్ లో మలైకా తళుక్కుమంది. రెడ్ హాట్ లుక్ లో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజు జెట్ స్పీడ్ తో అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఐదున్నర అడుగుల మలైకం ఈ స్పెషల్ డ్రెస్ లో ఈవెంట్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ రెడ్ హాట్ డిజైనర్ డ్రెస్ కి కాంబినేషన్ గా మలైకా మెడలో ముత్యాల హారం అంతే ఆకర్షణీయంగా కనిపిస్తోంది.ఇంతకుముందు కేన్స్- 2019 ఉత్సవాల్లో దీపికా పదుకొనే జియాంబట్టిస్టా వల్లి డ్రెస్ లో తళుకుబెళుకులు ప్రదర్శించింది. అప్పట్లో ఆ ఫోటోలు అంతర్జాలాన్ని సునామీలా చుట్టేసాయి. మరోసారి మలైకా సేమ్ డిజైనర్ డ్రెస్ తో ప్రత్యక్షమవ్వడంతో ముంబై ఫోటోగ్రాఫర్లు కెమెరా ఫ్లాష్ లతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటోలు చూపరుల్ని కట్టి పడేస్తున్నాయి.

జియాంబటిస్టా వల్లి అనేది హై రేంజ్ బ్రాండ్. ప్రఖ్యాత హెచ్ అండ్ ఎమ్ తో కలిసి ఈ డిజైన్ కి రూపకల్పన చేయడంతో అసాధారణ పాపులారిటీ దక్కించుకుంది. భారతదేశంలోను ఈ డిజైనర్ దుస్తులు ``జియాంబట్టిసా వల్లి x హెచ్ అండ్ ఎం`` పేరుతో పాపులరవుతున్నాయి.