Begin typing your search above and press return to search.

MAA త‌ర్వాత ఈ అసోసియేష‌న్ కి గుర్తింపు

By:  Tupaki Desk   |   28 Jun 2022 4:29 AM GMT
MAA త‌ర్వాత ఈ అసోసియేష‌న్ కి గుర్తింపు
X
తెలుగు సినీన‌టుల‌ను ఒక గూటికి చేర్చి సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తున్న అసోసియేష‌న్ గా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (MAA) పాపుల‌రైంది. దాదాపు 900 మంది పైగా ఆర్టిస్టుల‌తో మా అసోసియేష‌న్ అతి పెద్ద ఆర్టిస్టుల సంఘంగా పేరు బ‌డింది. ఈ సంఘంలో ప‌రిశ్ర‌మ ప్ర‌ధాన న‌టీన‌టులు స‌భ్యులుగా ఉన్నారు. అయితే ఇటీవ‌ల సంక్షేమం కంటే వివాదాలు ఎక్కువ‌వ్వ‌డంతో ఈ సంఘం ప్ర‌భ మ‌సక‌బారింది. ఆర్టిస్టుల‌కు సొంత ఇళ్లు.. 'మా' సొంత భ‌వంతి నిర్మాణం అంటూ హంగామా త‌ప్ప అస‌లు ప‌ని క‌నిపించ‌లేద‌న్న విమ‌ర్శ‌లున్నాయి.

టాలీవుడ్ కి మా అసోసియేష‌న్ కీల‌క‌మైన‌ది. దీని త‌ర్వాత మ‌ళ్లీ అంత‌గా పాపుల‌ర‌వుతోంది టీఎంటీఏయు అసోసియేష‌న్.. యూస‌ఫ్ గూడ ప‌రిస‌రాల్లో ఈ సంఘానికి సొంత ఆఫీస్ ఉంది. అలాగే ఇందులో చిన్న ఆర్టిస్టుల‌కు ప‌రిమిత రుసుముతో స‌భ్య‌త్వాల‌కు ఆస్కారం ఉండ‌డంతో ఈ అసోసియేష‌న్ కూడా అతిపెద్ద అసోసియేష‌న్ గా అవ‌త‌రిస్తోంది. ఇందులో దాదాపు 913 మంది ఆర్టిస్టులు స‌భ్యులుగా ఉన్నారు. ప్ర‌స్తుతం అసోసియేష‌న్ స‌భ్య‌త్వాల రెన్యువ‌ల్ జ‌రుగుతోంది. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న సారాంశం ఇలా ఉంది.

టీఎంటీఏయు యూనియన్ కార్డు రెన్యూవల్ చేసుకోని సభ్యులు ఎవరైనా ఉంటే త్వ‌ర‌గా రెన్యూవల్ చేయించుకోవాలని జనరల్ సెక్రటరీ గోవింద్ శ్రీనివాస్ తెలిపారు. పొడిగించిన గడువు తేదీ ఈ నెలాఖరుతో ముగుస్తుంది. పాత మెంబర్షిప్ బకాయిలు చెల్లించని వారికి రెన్యూవల్ చెయ్యడం కుదరదు. వారు ఎవరైనా ఆ మెంబర్షిప్ ఫీ సకాలంలో చెల్లిస్తే యూనియన్ అభివృద్ధికి ఉపయోగ పడుతుంది.

ఏదైనా ఇబ్బంది ఉంటే ఆఫీస్ కి వచ్చి తెలియజేయగలరు...అని ప్ర‌క‌ట‌న వెలువ‌రించారు. అలాగే రెన్యూవల్ ఈ నెలాఖరు వరకు అంటే 30 జూన్ వరకు పొడిగించామ‌ని తెలిపారు. ఇప్పటికే రెన్యూవల్ చేయించుకున్న వారితో కొత్త వాట్సప్ గ్రూప్ గ్రూవు క్రియేట్ అయింది. TMTAU NEW RENEWED GROUP లో యాక్టివిటీస్ జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించారు. దానివలన యూనియన్ నుంచి వచ్చే ఏ ఇన్ఫర్మేషన్ గాని లబ్ది గాని ఈ గ్రూవులోని వారికి మాత్రమే తెలియజేస్తామ‌ని వెల్ల‌డించారు.

జూన్ 30 తరువాత ఎవరైనా రెన్యూవల్ చెల్లించాలి అని అనుకుంటే అద‌నంగా ఇంకో రూ. 200/- లేటు ఫీజుతో రెన్యూవల్ చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. జులై 15 లోపు సీరియల్ నెంబర్ ప్రకారం రెన్యూవల్ చేయించుకున్న వారి కార్డ్స్ ప్రింట్ అవుతాయి. గత ఎన్నికలలో ఎవరైతే అర్హులుగా ఓటరు లిస్టులో ఉన్నారో వారు మాత్రమే రెన్యూవల్ చేసుకోవాలి. అంటే కార్డు నెంబర్ 101 నుంచి 913 వరకు ఉన్న సభ్యులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత అంటే 914 కార్డు నెంబర్ నుంచి రెన్యూవల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.

వారికి ఎదావిధిగా కార్డును ఇస్తారు. సభ్యుల వివరాలు తెలియజేస్తూ రెన్యూవల్ ఫార్మ్ ని అంద‌జేస్తున్నారు. ఆ ఫార్మ్ నింపి దానితో పాటు ఆధార్ కార్డు జెరాక్స్- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ జతచేసి ఆఫీస్ లో ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని అందరు అర్ధం చేసుకొని కమిటీ వారితో సహకరించి యూనియన్ అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నామ‌ని జనరల్ సెక్రటరీ కోరారు. మూవీ ఆర్టిస్టుల సంఘానికి ఆల్ట‌ర్నేట్ గా ఉన్న టీఎంటీఎయు ద్వారా ఆడిష‌న్స్ గురించి పుష్క‌ల‌మైన స‌మాచారం అందుతుంది. ఆఫీస్ అడ్రెస్ ల షేరింగ్ ఇత‌ర స‌హాయ‌స‌హ‌కారాలు ఆర్టిస్టుల‌కు అందుతున్నాయి. ఈ సంఘం ఇత‌ర సంఘాల‌తో పోలిస్తే సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో స‌హాయ‌స‌హ‌కారాల్లో ముందుందని సంఘ ప్ర‌తినిధి బోయిడి నూక‌రాజు వెల్ల‌డించారు.