Begin typing your search above and press return to search.

ఆ టైటిల్ బన్నీ కోసమేనా?

By:  Tupaki Desk   |   29 March 2023 6:00 PM GMT
ఆ టైటిల్ బన్నీ కోసమేనా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఓ వైపు కమర్షియల్ యాడ్స్ షూట్ చేస్తూనే పుష్ప 2 షూటింగ్ కొనసాగిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత బన్నీ యూనివర్శల్ కాన్సెప్ట్స్ ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. పుష్ప 2 కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ ఉండనుంది.

దాని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆఖరులో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కూడా అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా చేయనున్నాడు. అయితే అది ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఇంకా ఫిక్స్ కాలేదు.

కాని స్టైలిష్ స్టార్ ఇమేజ్ ని మరింత గ్రాండియర్ గా ఎస్టాబ్లిష్ చేసే ప్రాజెక్ట్ చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక స్టైలిష్ స్టార్ లో ఉండే డాన్స్ టాలెంట్ ని వరల్డ్ వైడ్ గా పరిచయం చేసే విధంగా ఒక ప్రాజెక్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో డ్యాన్సర్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేశారు.

ఈ టైటిల్ బట్టి మూవీ కచ్చితంగా డాన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని చెప్పొచ్చు. అది అల్లు అర్జున్ కోసమే రిజిస్టర్ చేయించిన టైటిల్ అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. నిజానికి డాన్సర్ టైటిల్ ఎవరైన సినిమా కోసం ఉపయోగించుకోవచ్చు.

అయితే గీతా ఆర్ట్స్ మాత్రమే ఈ టైటిల్ తో స్టార్ హీరోలతోసినిమాలు చేయగలదు. అందుకే అల్లు అర్జున్ కోసమే ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసి ఉంటారనే మాట బలంగా వినిపిస్తుంది. అయితే దీనిపై గీతా ఆర్ట్స్ నుంచి త్వరలో ఏమైనా అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందా లేదంటే హోల్డ్ లో పెడతారా అనేది వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.