మళ్లీ ఈమె ప్రభాస్ ను మోసేసింది

Mon Oct 18 2021 18:00:01 GMT+0530 (IST)

Recently again Kriti Sanon spoke about Prabhas in an interview

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు రూపొందుతున్నాయి. బాహుబలి సినిమాతో పాన్ ఇండి సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ తో నటించేందుకు గాను ఎంతో మంది హాట్ ముద్దుగుమ్మలు ఆసక్తి చూపిస్తున్నారు. సాహో సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా కపూర్ తో రొమాన్స్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా లో కృతి సనన్ తో కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే. ఇండస్ట్రీలో చాలా మంది ప్రభాస్ చాలా మృదు స్వభావి.. ఎవరితో ఎక్కువ మాట్లాడడు.. కొత్త వారిని చూస్తే ముడుచుకు పోయినట్లుగా అవుతాడు. ఇక హీరోయిన్స్ తో అయితే ఆయన కాస్త క్లోజ్ సన్నివేశాలను చేసేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతాడు అనే టాక్ ఉంది. కానీ ఈమద్య కాలంలో ప్రభాస్ తీరు మారినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనతో వర్క్ చేస్తున్న హీరోయిన్స్ మరియు ఆయన కో స్టార్స్ పలువురు ఆయన గురించిన విషయాలు చాలా పాజిటివ్ గా చెబుతున్నారు.ఇంతకు ముందే కృతి సనన్ ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ చాలా మంచి పర్సన్. ఒక స్టార్ అనే ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరితో ఒకేలా ఉంటాడు. ఆయన ఇతరులతో మాట్లాడకుండా ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం. కాని ఆయన తనకు పరిచయం అయిన ప్రతి ఒక్కరితో కూడా చాలా బాగా మాట్లాడుతారు అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి కృతి సనన్ ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడింది. మీడియాలో చాలా సార్లు ప్రభాస్ సిగ్గరి అని చూశాను. కానీ ఆయన కొత్త వారిని మొదటి సారి కలిసినప్పుడు మాత్రమే కాస్త అలా ఉంటారు. ఒక్కసారి పరిచయం అయ్యి క్లోజ్ అయితే మాత్రం అస్సలు మొహమాటం లేకుండా ఉంటాడు. చాలా క్లోజ్ గా మాట్లాడమే కాకుండా పంచ్ లు వేయడం.. సరదాగా ఆటపట్టించడం వంటివి కూడా చేస్తాడంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ప్రభాస్ చాలా మాటకారి అంటూ కృతి సర్టిఫికెట్ ఇచ్చేసింది. ప్రభాస్ అస్సలు మాట్లాడడు అనే టాక్ గతంలో ఉండే.. ఇప్పుడు కృతి సనన్ మాత్రం ఆయన మంచి మాటకారి అని కితాబిచ్చింది అంటే ప్రభాస్ లో చాలా మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ మరియు కృతి సనన్ కలిసి ఆదిపురుష్ లో నటిస్తున్నారు. రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. వీరిద్దరి కాంబో సన్నివేశాల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఓమ్ రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టులో ఆదిపురుష్ ను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.