రెబల్ స్టార్ మంచి మనసు.. పనిమనిషికి గౌరవం

Fri Oct 22 2021 23:00:01 GMT+0530 (IST)

Rebel star respect for the maid

రెబల్ స్టార్ కృష్ణం రాజు గురించి ఆయ సన్నిహితులు కథలు కథలుగా చెబుతూ ఉంటారు. రాజులు కనుక ఎంత మంచి మనసును కలిగి ఉంటారో అంతటి మంచి మనిషి కృష్ణం రాజు. తన పేరులో రాజు ఉన్నందుకు రాజంత మంచి మనసు గొప్ప వ్యక్తి కృష్ణం రాజు అంటారు. ఇన్నాళ్లు ఆయన సన్నిహితులు అనుకుంటున్న ఆ మాట ఇప్పుడు అంతా అనుకునేలా చేశారు. ఆయన తన ఇంట్లో 25 ఏళ్లుగా పని మనిషిగా చేస్తున్న మహిళను గౌరవించారు. ఆయన కుటుంబం మొత్తంకు కూడా ఆమె పాతికేళ్లుగా సన్నిహితురాలు. ఆమె ఇంట్లో మనిషిగా నిలిచారు. కృష్ణం రాజు పిల్లలు చిన్నప్పటి నుండి పెద్ద వారు అయ్యే వరకు ఆమె నే బాగోగులు చూసుకున్నారు.పద్మ అనే ఆ మహిళ తమ ఇంట్లో పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా కృష్ణంరాజు ఫ్యామిలీ మొత్తం కూడా ఆమెకు చిన్న సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమెతో పాతికేళ్ల సర్వీస్ అంటూ ఒక కేక్ కట్ చేయించడంతో పాటు ఆమె ను ప్రత్యేకంగా సన్మానించి తోచిన బహుమానాలను అందించారు. కృష్ణం రాజు కూతురు ప్రసీద సోషల్ మీడియా ద్వారా పద్మ పాతికేళ్ల సర్వీస్ కు సంబంధించిన ఫొటోలు మరియు ఆమెకును సత్కరించిన ఫొటోలను షేర్ చేశారు. 25 ఏళ్లుగా మా కోసం చాలా చేశారు. థ్యాంక్యూ పద్మ ఆంటీ అంటూ ప్రసీద పేర్కొన్నారు.

ఇన్నాళ్ల సేవకు గాను కృష్ణంరాజు భార్య శ్యామలదేవి బహుమానంగా పద్మకు ఒక బంగారు ఆభరణంను ఇవ్వడం జరిగింది. కృష్ణం రాజు మరియు ఆయన ఫ్యామిలీ యొక్క గొప్పతనంను ఈ ఫొటోలను చూసి అర్థం చేసుకోవచ్చు. పని మనుషులను అత్యంత హీనంగా కొందరు చూస్తూ ఉంటారు. ఇచ్చేది అయిదు పది వేలు అయినా కూడా వాళ్లను అత్యంత చీప్ గా చూస్తూ ఉంటారు. కాని పద్మ కు కావాల్సినంత వేతనం ఇస్తూనే ఆమె పాతికేళ్లుగా తమకు సేవ చేసినందుకు గాను ఆమెను గౌరవించుకోవడం అనేది నిజంగా అభినందనీయం. జీతం ఇస్తున్నాం.. పని చేస్తుంది ఇందులో గొప్పేముంది అంటూ కొందరు అనుకోవచ్చు. కాని కృష్ణం రాజు ఫ్యామిలీ మాత్రం అలా అనుకోలేదు. ఆమెను గౌరవించి తమ స్థాయిని మరింతగా పెంచుకున్నారు. కృష్ణం రాజు ఫ్యామిలీ ఈ పనితో ఇండస్ట్రీలోనే గొప్ప ఫ్యామిలీ ల్లో ఒక ఫ్యామిలీగా నిలిచారంటూ సోషల్ మీడియా టాక్ వినిపిస్తుంది.