ఒక్క ఏడాదిలో 50 సార్లు డేటింగ్ కు వెళ్లిన నటి.. తర్వాత ఏమైందంటే?

Sat May 14 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

Rebel Wilson dating news

ఒకసారి రెండు సార్లు డేటింగ్ కు వెళ్లడానికే తటపటాయించే రోజుల్లో ఒక్క ఏడాదిలో ఈ ప్రముఖ నటి ఏకంగా 50 సార్లు డేటింగ్ కు వెళ్లింది.  ఎంతమందితో వెళ్లింది? అసలు ఎందుకు వెళ్లిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ప్రముఖ ఆస్ట్రేలియన్ నటి రెబల్ విల్సన్ షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 2019లో తన వయసు 39 సంవత్సరాలు అని.. ఆ వయసులో 50 సార్లు వేర్వేరు వ్యక్తులతో డేట్ లకు వెళ్లినట్లు వెల్లడించింది. తాను డేటింగ్ కు వెళ్లిన వాళ్లలో కొంతమంది బిలియనీర్ లు ఉన్నారని తెలిపారు. మరికొందరు ఏమీ లేని వాళ్లు కూడా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తాను రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైనట్లు పేర్కొంది. ఇలా ఏడాదికే ఏకంగా 50 మందితో శృంగార అనుభవాన్ని పంచుకున్న ఈ నటి తీరు చూసి ఇప్పుడు అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఈ అమ్మడు ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

రెబల్ విల్సన్ పూర్తి పేరు.. ‘రెబెల్ మెలానియా ఎలిజిబెత్ విల్సన్’. ప్రధానంగా హాస్య పాత్రలను పోషించడానికి ప్రసిద్ధి చెందింది. ఆమె నిర్మాత రచయిత కూడా. అమెరికన్ రోమాంటిక్ కామెడీ ‘బ్యాచిలోరెట్’ ప్రముఖ అమెరికన్ టీవీ సీరీస్ ‘సూపర్ ఫన్ నైట్’ వంటి చలన చిత్రాలు టీవీ సీరియళ్లలో కనిపించింది.

ఆస్ట్రేలియాలోని సిడ్నీన్యూసౌత్ వేల్స్ లో జన్మించిన విల్సన్ ‘ఆస్ట్రేలియన్ థియేటర్ ఫర్ యంగ్ పీపుల్ లో నటనను అభ్యసించారు. తర్వాత ఆమె తదుపరి శిక్షణ కోసం న్యూయార్క్ వెళ్లింది.