Begin typing your search above and press return to search.

మీరా చోప్రా ట్వీట్స్ కోసమే ఇదంతా చేసిందా...?

By:  Tupaki Desk   |   7 Jun 2020 7:30 AM GMT
మీరా చోప్రా ట్వీట్స్ కోసమే ఇదంతా చేసిందా...?
X
'బంగారం' సినిమా హీరోయిన్ మీరా చోప్రా స్టార్ హీరో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మీరా చోప్రా ట్విట్టర్ చిట్ చాట్ లో తనకు ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని.. ఎన్టీఆర్ కంటే మహేష్ బాబు అంటే ఇష్టమని పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ట్విట్టర్ వేదికగా ఆమెను ట్రోలింగ్ చేయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరా చోప్రా ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మీరా కేసును ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేపట్టి 8 ట్విట్టర్ ఖాతాల నుంచే అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించారు. పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరా చోప్రా ఒక మీడియా ఛానల్ వారితో మాట్లాడుతూ సోషల్‌ మీడియా అత్యంత భయంకరమైన ప్రదేశంగా మారిందని.. సైబర్‌ వేధింపులు ఆగాలని చెప్పుకొచ్చింది.

''నేను ఎవరి ఫ్యాన్ గా ఉండాలనేది నా ఇష్టం. దానికే నాపై అత్యాచారం చేస్తామని.. ముఖంపై యాసిడ్‌ చల్లుతామని.. హత్య చేస్తామని వాళ్లు బెదిరించారు. సుమారుగా 30 వేలకు పైగా వేధింపుల ట్వీట్లు వచ్చాయి. అందుకే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకున్నా. దీన్ని వ్యతిరేకించకపోతే.. తప్పు చేసిన దాన్నవుతా. నేనెప్పుడూ న్యాయం వైపే ఉంటాను. అందుకే హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా. నేను ఢిల్లీలో ఉంటున్నా కాబట్టి.. ఢిల్లీ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాను' అని చెప్పింది మీరా. అంతేకాకుండా 'హీరోలు తమ ఫ్యాన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ గురించి తెలుసుకోవాలి. ఇలాంటి అనుచిత ప్రవర్తనను వారు ఖండించాలి. ఫ్యాన్స్ తమ ఫేవరైట్ హీరోల్ని దేవుళ్లుగా భావిస్తారు. కాబట్టి దేవుళ్ల మాటల్ని కచ్చితంగా వింటారని నా ఒపీనియన్. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. కానీ ఫ్యాన్స్‌ ప్రవర్తిస్తున్న తీరు ఏ మాత్రం బాలేదు. దీని పట్ల బాధపడుతున్నా. ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ ని తొలగించి వారిని శిక్షించాలి అని చెప్పుకొచ్చారు మీరా చోప్రా. అయితే ఫేడ్ అవుట్ దశలో ఉన్న మీరా చోప్రా కేవలం సోషల్ మీడియాతో వార్తల్లో నిలవడానికే ఇలా చేసిందని.. అందుకే ఇన్ని వేల ట్వీట్స్ వచ్చాయని చెప్పుకుంటుందని కొంతమంది నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మీరా చోప్రాకి ఎన్టీఆర్ ఎవరో తెలియదని మాట్లాడి వార్తల్లో నిలిచిందని.. దీనిని క్యాష్ చేసుకోవాలని ఆమె చూస్తోందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు.