Begin typing your search above and press return to search.

బోల్డ్ నిహారిక.. ఇంతలా మారడానికి కారణమేంటి?

By:  Tupaki Desk   |   29 May 2023 5:00 PM GMT
బోల్డ్ నిహారిక.. ఇంతలా మారడానికి కారణమేంటి?
X
మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక కొణిదెల. వరసగా మూడు, నాలుగు సినిమాలు చేసింది. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ, ఆమెలో మంచి నటి ఉంది అనే విషయం మాత్రం అర్థమైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని యాక్టింగ్ కి దూరమైంది. తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నిర్మాతగా రాణిస్తుంది అనుకున్నప్పుడు, ఆమె పర్సనల్ లైఫ్ గురించి కొన్ని వార్తలు వినిపించాయి. కాగా, ఆమె మళ్లీ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో యాక్టింగ్ మొదలుపెట్టింది.

ఇటీవల డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది. అందులో గేమ్ తప్ప మరో ప్రపంచం తెలియని అమ్మాయిగా నటించింది. ఈ సిరీస్ లోనూ కాస్త బోల్డ్ పదాలను వాడి అందరినీ షాక్ కి గురి చేసింది. వెబ్ సిరీస్ లో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లోనూ నిహారిక బోల్డ్ గా మారిందనే వార్తలు వినపడుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం నిహారిక టర్కీ కి హాలీడే ట్రిప్ కి వెళ్లింది. ఆ ట్రిప్ లో గతంలో ఎప్పుడు లేని విధంగా గ్లామరస్ ఫోటోలు దిగి అందరికీ షాకిచ్చింది. గతంలో నిహారిక చాలాసార్లు మెడ్రన్ డ్రెస్లులో కనపడింది. కానీ, మరీ ఈ రేంజ్ లో కనపడలేదు. దీంతో అందరూ కాస్త షాకయ్యారు. ఆ తర్వాత కొందరు యూట్యూబర్ లతో కలిసి ఇటీవల బాలి ట్రిప్ కి కూడా వెళ్లింది.

అక్కడ కూడా ఆమె చాలా గ్లామర్ గా దర్శనమిచ్చారు. ఆ ఫోటోలను కూడా ఆమె ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో ఈ ట్రిప్ లకు సంబంధించిన ఫోటోలన్నీ ఆమె షేర్ చేశారు.

అలాగే నటిగా కూడా అమ్మడు కాస్త బోల్డ్ గా నటించే ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ నటిగా బిజీ అవ్వాలని అనుకుంటున్నట్లు అర్ధమవుతోంది. నిహారికలో వచ్చిన ఈ సడెన్ ఛేంజ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తనకు నచ్చినట్లుగా తను ఉంటోందని, ఆమెకు నచ్చిన పాత్రలు కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటోందని , దానిలో తప్పేమి ఉందని కామెంట్ చేస్తున్నారు. మరి నిహారిక రాబోయే రోజుల్లో ఇంకా ఏ రేంజ్ వరకు వెళుతుందో చూడాలి.