సూర్య తెలివితేటలు చూపించాడు

Mon Apr 15 2019 17:55:30 GMT+0530 (IST)

Reason Behind Kaappaan Release Date Change

టాలీవుడ్ అనే కాదు ఓ సినిమాను మల్టీ లాంగ్వేజ్ లో తీస్తున్నప్పుడు ఆయా మార్కెట్లలో పరిస్థితులు పోటీ చిత్రాలు అన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే. లేదంటే ఇబ్బంది తప్పదు. పోనీ రిస్క్ చేసి ఏదైతే అదయ్యింది అని ఎదురీదితే నష్టపోయేది నిర్మాతే. సూర్య హీరోగా కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన కాప్పన్ నిర్మాతలు లైకా సంస్థ ఇదే కోణంలో ఆలోచించారు.మోహన్ లాల్-సూర్య-ఆర్య కాంబోలో భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన కాప్పన్ టీజర్ నిన్న విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దేశ భద్రత-తీవ్రవాదం-ప్రభుత్వ బాధ్యత కోణంలో ఆడియన్స్ కు కావాల్సిన మసాలాలు జోడించి తీసిన ఈ ఎంటర్ టైనర్ మీద అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా కాప్పన్ రిలీజ్ డేట్ గతంలో ఆగస్ట్ 15 అనుకున్నారు. దేశ సమగ్రతకు సంబంధించిన కథ కాబట్టి యాప్ట్ గా ఉంటుందని. అయితే అదే రోజు ప్రభాస్ సాహోని ఎప్పుడో ప్రకటించారు. ఒకవేళ క్లాష్ అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ కర్ణాటకలో ఎక్కువ నష్టపోయేది సూర్య సినిమానే. తమిళనాడు వరకు మాత్రమే సూర్య పెత్తనం ఉంటుంది. అందుకే ఈ రిస్క్ గురించి అలోచించి కాప్పన్ ను వెనుకడుగు వేసుకునేలా చేసి ఆగస్ట్ 30కే షిఫ్ట్ చేశారు.

ఇది కంప్లీట్ సేఫ్ గేమ్ అవుతుంది. అప్పటికే సాహో వచ్చి రెండు వారాలు దాటేస్తుంది కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. ఇవన్ని ఆలోచించే లైకా ఇలా ప్లాన్ చేసిందన్న మాట. ఇక్కడ ప్రభాస్ కు సూర్య భయపడ్డాడు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నప్పటికీ నిజానికి ఇది ప్రాక్టికల్ గా ఆలోచించి తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పొచ్చు