Begin typing your search above and press return to search.

భీమ్లా నాయ‌క్ నుంచి రానా గ్లింప్స్ కి రెడీనా?

By:  Tupaki Desk   |   14 Sep 2021 4:30 AM GMT
భీమ్లా నాయ‌క్ నుంచి రానా గ్లింప్స్ కి రెడీనా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `భీమ్లా నాయ‌క్` సంక్రాంతి బరిలో అత్యంత క్రేజీగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే రిలీజైన పవన్ టీజర్ ఇంట్రో సాంగ్ ప్ర‌కంప‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. కాప్ భీమ్లా నాయ‌క్ గ‌ర్జ‌న‌పై అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

అయితే ఇందులో రానా క్యారెక్టర్ కి అంత‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఒక సెక్షన్ విమర్శించిన సంగ‌తి తెలిసిందే. కానీ రానా పాత్ర‌ను ఏమాత్రం త‌గ్గించ‌బోమ‌ని ఆ త‌ర్వాత చిత్ర‌బృందం క్లారిటీనిచ్చింది. రానా పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్ ని కూడా త్వ‌ర‌లో విడుద‌ల చేస్తాం.. కాస్త ఓపిక ప‌ట్టండి అంటూ రానా అభిమానుల‌కు క్లారిటీనిచ్చారు. అయితే అందుకు స‌మ‌య‌మాస‌న్న‌మైందా? అంటే అవున‌నే స‌మాచారం.

రానా పాత్ర‌కు సంబంధించిన వీడియో సెప్టెంబర్ 17 తర్వాత ఏ క్ష‌ణం అయినా బయటకు వస్తుంది. ఈ టీజర్ పవన్ టీజర్ త‌ర‌హాలోనే ప‌వ‌ర్ ప్యాక్డ్ గా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ వార్తపై రానా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. టీజర్ కోసం ఉగ్గ‌బ‌ట్టి వెయిటింగ్. అధికారిక టీజర్ విడుదల తేదీ రెండు రోజుల్లో ప్రకటించ‌నున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

భీమ్లా నాయక్ 2020 మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ అధికారిక రీమేక్. సంఘంలో ఒక‌ ఈగోయిస్టిక్ పెద్ద‌మ‌నిషికి సిన్సియ‌ర్ పోలీసాఫీస‌ర్ కి మ‌ధ్య సాగే టిట్ ఫ‌ర్ ట్యాట్ గేమ్ ని తెర‌పై చూపించ‌నున్నారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ - బిజు మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. బిజు పాత్ర‌లో ప‌వ‌న్ .. పృథ్వీ పాత్ర‌ను రానా పోషిస్తున్నారు. భీమ్లా నాయక్ కి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ దీనికి స్క్రీన్ ప్లే - మాటలు రాశారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సంక్రాంతి పండుగ సీజన్‌లో 12 జనవరి 2022 న ఘ‌నంగా రిలీజ్ కానుంది.

ప‌వ‌న్ రేంజే కాదు రానా రేంజును పెంచే మూవీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి త‌గ్గ క‌థ కంటెంట్ కుదిరితే ఏ రేంజు ఉంటుందో ఇంత‌కుముందు రీమేక్ మూవీ గ‌బ్బ‌ర్ సింగ్ నిరూపించింది. చాలా ప‌రాజ‌యాల తర్వాత ప‌వ‌న్ కి అద్భుత‌మైన బ్లాక్ బ‌స్ట‌ర్ కుదిరింది. ఇప్పుడు మ‌ళ్లీ చాలా గ్యాప్ త‌ర్వాత ప‌వ‌న్ అద్భుత కాన్సెప్టుల్ని ఎంచుకుని న‌టిస్తున్నారు. ఇప్పుడు ప‌వ‌న్ న‌టిస్తున్న సినిమాల్లో భీమ్లా నాయ‌క్ పైనా అభిమానుల్లో అత్యంత ఆస‌క్తి నెల‌కొంది. ఇది ప‌వ‌న్ ఇమేజ్ ని పెంచే సినిమా అన‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని టాక్ వినిపిస్తోంది. అందుకు సాక్ష్యంగా ఇటీవ‌ల రిలీజైన మోష‌న్ టీజ‌ర్ స‌హా పాట యువ‌త‌రంలో పదే ప‌దే చ‌ర్చకు రావ‌డం క‌నిపిస్తోంది.

చాలా తక్కువ వ్యవధిలోనే ఈ మూవీ గొప్ప ప్ర‌మోష‌నల్ మైలేజ్ ని ద‌క్కించుకుంది. అలాగే టైటిల్ పాట పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ ను పూర్తి స్థాయికి పెంచుతోంది. ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ప్రతిచోటా మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో ఉంది. పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్న కంటెంట్ ఇది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో రానా పాత్ర‌ను త‌క్కువ చేశారా ఎక్కువ చేశారా? అన్న‌ది తెలియాలంటే టీజ‌ర్ వ‌ర‌కూ ఆగాల్సిందే. అత‌డిని కూడా మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ గా ఆవిష్క‌రిస్తామ‌ని భ‌రోసానిచ్చారు కాబ‌ట్టి కొంత స‌హ‌నం అవ‌స‌రం. ఇన్ సైడ్ సోర్స్ ప్ర‌కారం ప‌వ‌న్ .. రానా ఇద్ద‌రి మైలేజ్ ని పెంచే సినిమాగా భీమ్లా నాయ‌క్ నిల‌వ‌నుంది.