మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. నిన్నటి రోజున సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ కొట్టి..దర్శక నిర్మాతలకు స్ర్కిప్ట్ అందించారు. డి. సురేష్ బాబు కెమెరా స్విచ్చాణ్ చేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెక్కం వేణుగోపాల్-చదలవాడ శ్రీనివాసరావు-రఘు తదితరులు పాల్గొన్నారు.
కానీ రవితేజ మాత్రం ఎక్కడా కనిపించలేదు. తనయడు సినిమా లాంచింగ్ రోజునే రవితేజ కనిపించక పోవడంతో చర్చనీయాంశమైంది. తమ్ముడు కుమారుడుని దగ్గరుండి హీరోగా పరిచయం చేయాల్సిన బాధ్యత రవితేజ పై ఉంది? ఆయన మాత్రం ఎక్కడా కనిపించలేదు! అంటూ అంతా గుసగుసలా డుకున్నారు. రవితేజ కుటుంబం నుంచి ఓ హీరో వస్తున్నాడంటే? బోలెడంత హడావుడి ఉండాలి.
కానీ అదెక్కడా కనిపించలేదు. వేడుక నిరాడంబరంగా జరిగిపోయింది. మరి రవితేజ అందుబాటులో లేక రాలేకపోయారా? లేక సెంటిమెంట్ గా భావించి రాలేదా? అన్నది తెలియదు. రవితేజ చాలా రేర్ గా మీడియా కంట పడుతుంటారు.
తన సినిమా ఈవెంట్లకు తప్ప బయట ఈవెంట్లలో పెద్దగా కనిపించరు. గెస్ట్ గా ఆహ్వానించినా ఆయర రారు అన్న విమర్శ కూడా ఉంది. అయితే నేరుగా కుమారుడి సినిమా విషయంలో కూడా రవితేజ ఢుమ్మా కొట్టడమే బాగోలేదంటూ అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
అయితే రవితేజ ట్విటర్లో మాత్రం మాధవ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ పోస్ట్ చేసారు. కానీ హాజరు కాకపోవడానికి గల కారణాన్ని మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. మరి రవితేజ రాకపోవడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందన్నది తెలియాలి.
ఈ విషయంపై రఘు కూడా ఎక్కడా మాట్లాడింది లేదు. గతంలో రవితేజ సోదరుడు భరత్ యాక్సిడెంట్ కి గురై మరణించిన సమయంలోనూ రవితేజ ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.