'డబుల్ ధమాకా' అంటే ఇదన్నమాట!

Mon Sep 26 2022 06:02:08 GMT+0530 (India Standard Time)

Raviteja Dual Role In Dhamaka

మాస్ మహారాజ రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అని అనుకునే లోపే ఆ వెంటనే మరో డిజాస్టర్ తో ఊహించని విధంగా అభిమానులను నిరాశపరుస్తున్నాడు. అసలు రవితేజ ఆలోచించే కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడా? అతనికి సక్సెస్ అనేది లక్కుతో వస్తోందా? అనే విషయం కూడా అర్థం కావడం లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఖిలాడి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు వరుసగా భారీ స్థాయిలో నష్టాలను కలిగించడంతో మాస్ రాజా తదుపరి సినిమాలో ఎలా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తప్పకుండా తదుపరి సినిమాలపై డిజాస్టర్స్ ప్రభావం అయితే ఉంటుంది. ఆ సినిమాలకు మంచి టాక్ వస్తే గాని కలెక్షన్స్ అయితే రావు. ఇక ఇప్పుడు రెడీగా ఉన్న సినిమాలలో ఓ వర్గం వారి ఫోకస్ మాత్రం ధమాకా అనే సినిమా పైనే ఉంది.

సినిమా చూపిస్త మావ నేను లోకల్ అనే సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపును అందుకున్న త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై రవితేజ చాలా నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ సినిమాకు డబుల్ ధమాకా అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే విషయంలో కూడా ఒక టాక్ వినిపిస్తోంది. టైటిల్ లోనే కథ కనెక్ట్ అయ్యేవిధంగా ఉండాలి అని ఆలోచించి మరి ఈ టైటిల్ పెట్టారట.

డబుల్ ధమాకా అంటే ఈ సినిమాలో ఇద్దరు రవితేజలో కనిపిస్తారు అని ఒక కొత్త టాక్ అయితే వినిపిస్తోంది. రవితేజ రెండు విభిన్నమైన గెటప్స్ లో ఆడియన్స్ కు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. తప్పకుండా సినిమాలో కామెడీ యాంగిల్ లో మాత్రం గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనిపిస్తాడు అని తెలుస్తోంది.

ఇక వీలైనంత త్వరగా ఈ సినిమాకు సంబంధించిన పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.ఇటీవల విడుదలైన సాంగ్ కూడా పరవాలేదు అనే విధంగా మాస్ ఆడియోన్స్ ను మెప్పించింది. మరి సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.