మాస్ మహారాజా 'RT67' ప్రీ లుక్ పోస్టర్...!

Sat Oct 17 2020 18:00:28 GMT+0530 (IST)

Raviteja 67 Pre Look Poster

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ దూకుడు చూపిస్తున్నాడు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్ట్ లు లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'క్రాక్' సినిమా సెట్స్ పై ఉండగానే రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు. 'రాక్షసుడు' వంటి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కించనున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ ను ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఏ స్టూడియోస్ మరియు బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో హవీష్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రవితేజ కెరీర్లో 67వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్ చిత్ర యూనిట్ (శనివారం) విడుదల చేస్తూ.. ముహూర్తం మరియు ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చింది.తాజాగా విడుదలైన 'RT67' ప్రీ లుక్ పోస్టర్ లో స్టైలిష్ గా డాన్స్ చేస్తున్నట్లున్న రవితేజ షాడో ఇమేజ్ కనిపిస్తోంది. ఈ మూవీ ముహూర్తం వేడుక రేపు(ఆదివారం) జరగనున్నది. అదేరోజు ఉదయం 11:55 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించనున్నారు. గతంలో రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్ లో రూపొందిన 'వీర' చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ 'రాక్షసుడు' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రమేశ్ వర్మ స్క్రిప్ట్‌పై నమ్మకంతో మరోసారి అతనితో కలిసి పనిచేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. 'RT67' మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.