Begin typing your search above and press return to search.

హీరోగా సపోర్ట్ చేశారు.. నిర్మాతగానూ సపోర్ట్ చేసేయండి: రవితేజ

By:  Tupaki Desk   |   28 Nov 2022 9:31 AM GMT
హీరోగా సపోర్ట్ చేశారు.. నిర్మాతగానూ సపోర్ట్ చేసేయండి: రవితేజ
X
మాస్ మహారాజా రవితేజ హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. RT టీమ్‌ వర్క్స్ అనే బ్యానర్ ని స్థాపించి తన సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. అలానే విష్ణు విశాల్ నటించిన 'FIR' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసారు. ఈ క్రమంలో ఇప్పుడు ''మట్టి కుస్తీ'' అనే ఫ్యామిలీ అండ్ స్పోర్ట్స్ డ్రామాని నిర్మించారు రవితేజ.

విష్ణు విశాల్ మరియు ఐశ్వర్య లక్ష్మి హీరో హీరోయిన్లుగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''మట్టి కుస్తీ''. ఆర్టీ టీమ్‌ వర్క్స్ - విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై రవితేజతో కలిసి విష్ణు ఈ సినిమాని నిర్మించాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా 'మట్టి కుస్తీ' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు రవితేజ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రస్తుతం మాస్ రాజాతో సినిమాలు చేస్తున్న సుధీర్ వర్మ - వంశీలతో పాటుగా విష్ణు విశాల్ భార్య జ్వాలా గుత్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవితేజ - విష్ణు - ఐశ్వర్య లక్ష్మి - జ్వాలా గుత్తా కలిసి సినిమాలోని చల్ చక్కని చిలక పాటకు వేదికపై డ్యాన్స్ చేసి ప్రేక్షకులని అలరించారు.

అనంతరం రవితేజ మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ' సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జస్టిన్ ప్రభాకరన్ సౌండ్ - బ్యాగ్రౌండ్ స్కోర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. తనతో సినిమా కూడా చేయాలని విష్ణుతో చెప్పాను. రిచర్డ్స్ వండర్ ఫుల్ కెమెరామెన్. దర్శకుడు చెల్లా అయ్యావు కథ చెప్పినపుడు నవ్వీ నవ్వీ చచ్చాను. తన సెన్స్ అఫ్ హ్యుమర్ బావుంటుంది. తనతో కచ్చితంగా ఓ సినిమా మాత్రం చేయాలి అని అన్నారు.

''అందం, ప్రతిభ కలిపితే ఐశ్వర్య లక్ష్మీ. ఇందులో ఆమె పాత్రని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విశాల్ - ఐశ్వర్య కెమిస్ట్రీ స్టన్నింగ్ గా వుంటుంది. ఇది కేవలం స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు.. ఎమోషన్, ఫ్యామిలీ, లవ్, ఎంటర్టైన్మెంట్ అన్నీ వున్నాయి. ఆర్టీ టీమ్‌ వర్క్స్ - విష్ణు విశాల్ స్టూడియోస్ ఈ రెండు టీములు సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథులు అభిమానులే. హీరోగా ఎంతో సపోర్ట్ చేశారు. నిర్మాతగా కూడా సపోర్ట్ చేసేయండి. విష్ణు విశాల్ పాజిటివ్ పర్శన్. ఫస్ట్ మీటింగ్ లోనే విశాల్ కు ఎప్పటి నుండో తెలుసనే ఫీలింగ్ కలిగింది. అన్నీ సింగిల్ సిట్టింగ్ లోనే మొదలైపోయాయి. సినిమా చాలా బావొచ్చింది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 2న థియేటర్లో కలుద్దాం'' అని రవితేజ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా విష్ణు విశాల్ మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ' డిసెంబర్ 2 థియేటర్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. చాలా ఆనందంగా వుంది. రవితేజ గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయనది చాలా మంచి మనసు. ఒక్క మీటింగ్ లోనే నాపై పూర్తి నమ్మకం ఉంచారు. జ్వాలా నన్ను తెలుగు సినిమాలు చేయాలనీ చెప్పేది. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ని ప్రేమిస్తారు. రవితేజ గారి లాంటి గొప్ప వ్యక్తి సపోర్ట్ తో మీ ముందుకు వస్తున్నాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆడ మగ సమానమనే సందేశాన్ని చాటే సినిమా ఇది. మహిళా ప్రేక్షకులు సినిమాని చాలా ఇష్టపడతారు. డిసెంబర్ 2న అందరూ థియేటర్ కి వెళ్లి 'మట్టి కుస్తీ' చూడాలి అని కోరారు.

ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ' చక్కని సినిమాని నిర్మించిన రవితేజ గారు, విష్ణు విశాల్ గారికి కృతజ్ఞతలు. డిసెంబర్ 2న మీ ఫ్యామిలీ అందరికీతో కలసి థియేటర్లో 'మట్టి కుస్తీ' ని చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పింది.

దర్శకుడు చెల్లా అయ్యావు మాట్లాడుతూ.. రవితేజ గారు 'మట్టి కుస్తీ' ని నిర్మించడం చాలా ఎక్సయిటింగా వుంది. రవితేజ గారి తమిళనాడులో కూడా భారీ ఎత్తున అభిమానులు వున్నారు. 'క్రాక్' సినిమా హౌస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఆ సినిమాని చాలా మంది రీమేక్ చేయాలని భావించారు. అయితే రవితేజ గారు బాడీ లాంగ్వేజ్ - స్టయిల్ రిప్లేస్ చేయడం చాలా కష్టం. రవితేజ గారు త్వరగా తమిళ్ లో సినిమా చేయాలి. విష్ణు విశాల్ - ఐశ్వర్య అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేశారు. అన్ని ఫ్యామిలీతో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి అని అన్నాడు.

జ్వాలా గుత్తా మాట్లాడుతూ.. ''విష్ణుని తెలుగులోకి రమ్మని మూడేళ్ళుగా అగుడుతున్నాను. తన చిత్రాల కంటెంట్ బావుటుంది. రవితేజ గారికి ని నేను పెద్ద అభిమానిని. విశాల్ పై రవితేజ గారు మొదటి మీటింగ్ లోనే ఎంతో నమ్మకం ఉంచారు. ఇది చాలా గ్రేట్. 'మట్టి కుస్తీ' కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అవుట్ పుట్ పై చాలా హ్యాపీగా వున్నాం. టీం అందరికీ గుడ్ లక్'' అని అన్నారు.

జస్టిన్ ప్రభాకరన్ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. డియర్ కామ్రేడ్ - రాధే శ్యామ్ లో నేను చేసిన మ్యూజిక్ ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. 'మట్టి కుస్తీ' మీ అందరికీ నచ్చుతుందన్నారు. రిచర్డ్ ఎం నాథన్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళుతోంది. ఇక్కడ ప్రేక్షకులు సినిమాని ప్రేమిస్తారు. 'మట్టి కుస్తీ' కచ్చితంగా మీకు నచ్చుతుంది. రవితేజ గారు నిర్మాత ఈ సినిమాని ఎంత అద్భుతంగా చేశారో క్యాలిటీ చూస్తే తెలిసిపోతుంది అని తెలిపారు.

కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. విష్ణు విశాల్ సినిమాలు డిఫరెంట్ గా వుంటాయి. ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. రవితేజ గారు ఒక సినిమా ఎంపిక చేసుకున్నారంటే ఖచ్చితంగా అద్భుతంగా వుంటుంది అంటూ 'మట్టి కుస్తీ' టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా సుధీర్ వర్మ - వంశీ - రాకేందుమౌళి మాట్లాడుతూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.