Begin typing your search above and press return to search.

మాస్ రాజా క్రాక్.. ఆ హీరో సినిమానా??

By:  Tupaki Desk   |   23 Jan 2021 8:02 AM GMT
మాస్ రాజా క్రాక్.. ఆ హీరో సినిమానా??
X
మాస్ రాజా రవితేజ ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది క్రాక్. ఈ సినిమాతో దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ తో పాటు ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే బ్లాక్ బస్టర్ క్రాక్ సినిమా వెనక ఓ సీక్రెట్ స్టోరీ ఉందట. నిజానికి క్రాక్ సినిమా ప్రారంభంలో నిర్మాత ఠాగూర్ మధు.. డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో సినిమా చేయాలని అనుకున్నప్పుడు చాలా రోజులు కథ కోసం వెతికారట. అలాంటి సమయంలో గోపిచంద్ తమిళంలో సూపర్ హిట్ అయిన సేతుపతి సినిమాను తన స్టైల్‌లో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. అప్పటికే హీరోగా రవితేజను ఓకే అనుకున్నారు. కానీ ఎందుకో రవితేజ ఆ సినిమాను సున్నితంగా తిరస్కరించేసాడు. రవితేజ నో అనడంతో ఆ ప్రాజెక్ట్ కాస్త నందమూరి కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్ళిందట.

ఇక కళ్యాణ్ రామ్ బంధువు హరి ఆయన ఐడియాలను జోడించి ప్రాజెక్టును లైన్ చేశాడట. అప్పుడు కథ ఓ కొలిక్కి రాగానే.. ఓ మలయాళ చిత్రం నుండి మామిడి కాయ, కరెన్సీ నోట్ మేకు లాంటి అంశాలను కథలో మెయిన్ చేసేసారు. అంతా అయిపోయాక స్క్రిప్ట్ రెడీ అయింది. ఆ వెంటనే రవితేజకు వార్త తెలిసి ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అని చెప్పాడట. ఇక మేకర్స్ ఫస్ట్ ఛాయస్ కూడా రవితేజ కావడంతో వారు కళ్యాణ్ రామ్ ను పక్కన పెట్టేసి రవితేజతో కంటిన్యూ అయిపోయారట. అలా క్రాక్ సినిమా పట్టాలెక్కిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త తెలిసి కళ్యాణ్ రామ్ ప్లేట్ లో పడిన క్రాక్ మూవీని ఎత్తుకెళ్ళాడని నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రాక్ సినిమా విజయవంతంగా థియేటర్లలో సందడి చేస్తోంది. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా క్రాక్ టాపర్ అనిపించుకుంది. చూడాలి మరి దీనిపై మేకర్స్ పెదవి విప్పుతారేమో!