Begin typing your search above and press return to search.

ఆ హీరోతో మాస్ రాజా మల్టీస్టారర్

By:  Tupaki Desk   |   27 March 2023 8:00 AM GMT
ఆ హీరోతో మాస్ రాజా మల్టీస్టారర్
X
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మల్టీ స్టారర్ కథలు చేయడానికి హీరోలుగా కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య మల్టీ స్టారర్ చిత్రంగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక యువ హీరోలు అందరూ కూడా మంచి యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలు వస్తే వేరొక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ లైన్ లో ముందు వరుసలో ఉన్న హీరో రవితేజ అని చెప్పాలి. మాస్ మహారాజ్ రవితేజ ధమాకా, వాల్తేర్ వీరయ్య సినిమాలతో రెండు సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్నారు.

ఇక మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి రెడీగా ఉండే మరో హీరో శర్వానంద్ అని చెప్పాలి. గత ఏడాది శర్వా ఒకే ఒక జీవితం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ, శర్వానంద్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ కి రంగం సిద్ధం అవుతుంది. ఓ యంగ్ దర్శకుడు ఇప్పటికే రవితేజ, శర్వానంద్ ని కలిసి స్టొరీ నేరేట్ చేయడం జరినట్లు తెలుస్తుంది. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీగా ఉన్నట్లుగా సమాచారం.

త్వరలో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కూడా చేస్తున్నాడు.

ఈ శర్వానంద్ కూడా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం వీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత మల్టీ స్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.