ఫొటోటాక్ : అన్నచెల్లి కాదు తండ్రి కూతురు

Mon Sep 28 2020 10:30:58 GMT+0530 (IST)

Ravi Teja With His Daughter

మాస్ మహారాజా రవితేజ అయిదు పదుల వయసు దాటి రెండేళ్లు అయినా కూడా మూడు పదుల వయసు వ్యక్తిగానే కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో నిన్న ఆయన డాటర్స్ డే సందర్బంగా షేర్ చేసిన ఫొటో ఒకటి వైరల్ అవుతుంది. అందులో రవితేజ మరియు ఆయన కూతురు మోక్షద అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా ఫొటోను చూసిన అభిమానులు ఎక్కువ శాతం వీరిద్దరు తండ్రి బిడ్డ అంటే నమ్మడం కష్టంగా ఉంది. అన్న చెల్లి అంటే ఈజీగా నమ్ముతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ మరియు మోక్షదలు ఇద్దరు కూడా చాలా నాచురల్ గా అందంగా ఉన్నారంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.రవితేజకు ఇద్దరు పిల్లలు. ఒక బాబు ఒక పాప. వీరిని చాలా ఏళ్ల పాటు మీడియాకు దూరంగా ఉన్నారు. ఈమద్య కాలంలో వారు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. రవితేజ తనయుడు ఇప్పటికే ఒక సినిమాలో నటించిన విషయం తెల్సిందే. మోక్షద కూడా హీరోయిన్ గా సూట్ అయ్యేలా ఉంది. మరి ఆమెను హీరోయిన్ గా చేయించే అవకాశం ఉందా.. ఆమెకు నటనపై అసలు ఆసక్తి ఉందా అనేది తెలియాల్సి ఉంది. రవితేజ హీరోగా ప్రస్తుతం 'క్రాక్' సినిమా రూపొందుతుంది. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత మరో రెండు సినిమాలను కూడా రవితేజ కమిట్ అయ్యి ఉన్నాడు. ఆమద్య కాస్త డల్ అయినట్లుగా అనిపించినా రవితేజ మళ్లీ మంచి ఫిజిక్ ఫేస్ లో ఛార్మింగ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.