ఈ సెకండ్ హీరోయిన్ సెంటిమెంట్ ఏంటి రాజా?

Thu Apr 22 2021 15:00:01 GMT+0530 (IST)

Ravi Teja To Romance Two Heroines Again In His Upcoming Movie

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడీ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. రవితేజ గతంలో కూడా చాలా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలు కొన్ని సక్సెస్ అయ్యాయి. ఖిలాడీపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ కారణంగానే రవితేజ తన తదుపరి సినిమాల్లో కూడా ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇటీవలే రవితేజ హీరోగా కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో ఒక సినిమా సినిమా ప్రారంభం అయ్యింది. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడ్డ విషయం తెల్సిందే. రవితేజ.. శరత్ ల కాంబో సినిమాలో మజిలీ సెకండ్ హీరోయిన్ దివ్యన్షా కౌశిక్ ను ఎంపిక చేయడం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

అయిదు పదుల వయసు దాటిన రవితేజ ఇప్పుడు వరుసగా ఇద్దరు హీరోయిన్స్ తో నటించేందుకు ఆసక్తి చూపించడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ మరియు త్రినాధ రావు నక్కని ల కాంబోలో కూడా ఒక సినిమా రూపొందబోతుంది. ఈ ఏడాది లోనే ఆ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఆ సినిమా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ సినిమా లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉందేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.