Begin typing your search above and press return to search.

#RT69 `ధమాకా` అంటే బ్లాస్ట్ అని మీనింగ్

By:  Tupaki Desk   |   15 Oct 2021 5:30 AM GMT
#RT69 `ధమాకా` అంటే బ్లాస్ట్ అని మీనింగ్
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇస్పీడ్ కి ఎదురే లేదు. వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు రాజా. ఖిలాడీ - రామారావు.. చిత్రాల‌తో బిజీగా ఉన్న ర‌వితేజ ఇప్పుడు త్రినాథ‌రావుతో సినిమాకి సంబంధించిన వేడెక్కించే అప్ డేట్ అందించారు.

మాస్ మహారాజా రవితేజ - త్రినాధరావు నక్కిన కలయిక లో తెర‌కెక్కుతున్న‌ #RT69 టైటిల్ ని విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. `ధ‌మాకా` అనేది టైటిల్. `డబుల్ ఇంపాక్ట్` అనేది సినిమా ట్యాగ్‌లైన్. ధమాకా అంటే బ్లాస్ట్ అయ్యే నేచుర్.. మాస్ మ‌హారాజా రవితేజ ఎన‌ర్జీకి తగిన టైటిల్. టైటిల్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా రూపొందించింది టీమ్.

టైటిల్ కి తగ్గట్టుగానే రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మాసీగా కనిపిస్తున్నారు. స్పోర్టీ లుక్ కళ్లద్దాలు ధ‌రించి పెద‌వి అంచుపై సిగరెట్ ని ఉంచాడు. రవితేజ ముఖంలో ఏదో గూఢార్థం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. ఈ పోస్టర్ స్ప్లిట్ ఇమేజ్ క‌థాంశాన్ని రివీల్ చేస్తోంది. రవితేజ తన మునుపటి చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో కనిపించ‌నున్నారు.

ధమాకా మొదటి లుక్ రాజా ఫ్యాన్స్ లో దూసుకెళుతోంది. బ్యాక్ టు బ్యాక్ విల‌క్ష‌ణ చిత్రాల‌ను ప్లాన్ చేస్తున్న‌ రవితేజ కి కెరీర్ లో ఇది చాలా ప్రత్యేక చిత్రం. విభిన్నమైన‌ పాత్రలను అత‌డు ప్ర‌య‌త్నిస్తున్నాడు.ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ క‌థాంశంతో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ భారీ స్థాయిలో నిర్మించ‌నుంది. టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాలో కొంద‌రు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించ‌నున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ప‌ని చేయ‌నున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ- మాటలు అందించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇతర నటీనటులు సిబ్బంది వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. పోస్టర్‌లో ``సెట్స్‌లో బ్లాస్ట్ ఉంది`` అని రాయ‌డం ఆస‌క్తిక‌రం.

`ఖిలాడీ` రిలీజ్ తేదీ లాక్ అయ్యిందా?

మాస్ రాజా ర‌వితేజ `క్రాక్` తో సంక్రాంతికి అభిమానుల‌కు బిగ్ ట్రీట్ ఇచ్చారు. గాడి త‌ప్పిన బండిన క్రాక్ హిట్ తో ప‌ట్టాలెక్కించారు. గ‌తించిన వైభ‌వానికి మ‌ళ్లీ చేరువ‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ర‌మేష్ వ‌ర్మ దర్శ‌క‌త్వంలో `ఖిలాడీ` సినిమా చేస్తున్నారు. ఇది భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. మాస్ రాజా అభిమానుల్ని ఏ మాత్రం నిరుత్సాహ‌ప‌రచ‌కుండా ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్నారు. రెండు భిన్న‌మైన పాత్ర‌ల‌ని స‌మాచారం. సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అటు పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో యూనిట్ ప్ర‌చారం ప‌నులు మొద‌లు పెట్ట‌డానికి రెడీ అవుతోంది. కొన్ని రోజుల్లోనే లిరిక‌ల్ సాంగ్స్ ని రిలీజ్ చేయ‌డానికి స‌న్న‌ద్దం అవుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే రిలీజ్ ముహూర్తం కూడా ఫిక్స్ అయిన‌ట్లు ఇన్ సైడ్ టాక్. దీపావ‌ళి కానుకగా చిత్రాన్ని న‌వంబ‌ర్ లో థియేట‌ర్లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారుట‌. ఇప్ప‌టికే పెండింగ్ ప‌నుల్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. పెన్ స్ట‌డియోస్- ఏ స్టూడియో స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ‌రో వైపు ర‌వితేజ `రామారావు ఆన్ డ్యూటీ `అనే మ‌రో చిత్రంలో కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ పేరునే టైటిల్ గా ఫిక్స్ చేయ‌డంతో అంచ‌నాలు భారీగా నెల‌కొంటున్నాయి.