Begin typing your search above and press return to search.
కాఫీ పేరుతో రాత్రికి రమ్మని పిలిచింది! రవికిషన్
By: Tupaki Desk | 27 March 2023 6:30 PMకాస్టింగ్ కౌచ్ బాధితులనగానే అందరికీ మహిళలే గుర్తొస్తారు. # మీటూ ఉద్యమంలో భాగంగా బాధిత మహిళలంతా మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లైంగికంగా వేధింపబ డ్డవారంతా తమ గోడును విన్న వించుకున్నారు. కాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలు ఎలాంటి దోపిడికి గురవుతారన్నది అర్ధమైంది. తాజాగా భోజ్ పురి నటుడు రవికిషన్ కూడా `నేను కాస్టింగ్ కౌచ్ బాధితుడినే` అంటూ ముందుకొచ్చారు.
పురుషుడు కాస్టింగ్ కౌచ్ గురవ్వడం ఏంటి? అని వింతగా అనుకుంటున్నారా? ఇది నిజమే! సినీ పరిశ్రమలోకి రవికిషన్ వచ్చిన కొత్తలో కాఫీ కోసం రాత్రి కి రావాలని ఓ మహిళ పిలిచిందిట. అయితే నేరుగా కాకుండా పరోక్షంగా ఈ విషయాన్ని తనకి అర్ధమయ్యేలా చేసిందిట. దీంతో విషయం అర్ధమవ్వడంతో రవికిషన్ వెంటనే నో చెప్పారుట. ఇప్పుడా మహిళ పెద్ద స్థాయిలో ఉందని పేర్కొన్నారు. మహిళ పేరు మాత్రం ఎప్పటికీ ఎక్కడా చెప్పనని అన్నారు.
రవి కిషన్ లాంటి కొందరు పురుషులు కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని గతంలో షేరు చేసుకున్న వారున్నారు. లైంగిక బాధిరురాళ్లే కాదు..బాధితులము చాలా మంది ఉన్నామని కొందరు పురుషులు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. అయితే భారతీయ చట్ట ప్రకారం పురుషుడిపై లైంగిక దాడి జరిగినా ఎలాంటి కేసులు లేవు. ఓ చట్టం తీసుకురావాలని గతంలో బాధితులు మొరపెట్టుకున్నారు.
కానీ ఇది ఇప్పటివరకూ సాధ్యపడలేదు. రవికిషన్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. `రేసుగుర్రం`లో మద్దాలి శివారెడ్డి పాత్రలో నటించారు. ఈ పాత్ర పేరు ప్రేక్షకులకు బాగా చేరువైంది. రవి కిషన్ అనడం కంటే మద్దాలి పేరుతోనే ఇక్కడ బాగా పాపులర్ అయ్యారు. అటుపై `కిక్-2`-`సుప్రీమ్`- `రాధ`..`లై` -`సాక్ష్యం`-`సైరా నరసింహారెడ్డి` లాంటి చిత్రాల్లోనూ కీలక పాత్రలతో మెప్పించారు. అలాగే రాజకీయంగానే రాణిస్తున్నారు. ఓ నియోజకవర్గం నుంచి ఎంపీ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.