లిప్ కిస్ లు స్విమ్ సూట్లు కాదంటే 'అహంకారి' అన్నారు!

Wed Feb 08 2023 06:00:01 GMT+0530 (India Standard Time)

Raveena Tandon Revealed Intresting Comments

ఘాటుగా అందాల్ని ఆరబోయడం వేరు!  థై సొగసుల ఎలివేషన్ తో కుర్రకారును పిచ్చెక్కించడం వేరు. ఈ రెండు విద్యల్లో ఆరితేరిన నటిగా సీనియర్ నటి రవీనా టాండన్ నాటి యూత్ ని ఒక ఊపు ఊపారు. క్లాసిక్ డ్యాన్సులతో మతులు చెడగొట్టిన ప్రతిభ తన సొంతం.



ఘాటైన బెడ్ రూమ్ సన్నివేశాల్లో జీవించడంలో వాన పాటల్లో డ్యాన్సులాడడం.. తడిపొడి చీరల్లో గుబులు రేపడంలో ఈ అమ్మడి తర్వాతే. బాలకృష్ణ 'బంగారు బుల్లోడు' చిత్రంలోను రవీనా గ్లామరస్ పాత్రలో నటించి మెప్పించింది. వానపాటతో మురిపించింది. చిట్టి పొట్టి నిక్కర్లతో పల్లెటూరి నదిలో స్నానానికి దిగే పట్నం అమ్మాయిగా గుబులు రేపింది.

అదంతా పాత మెమరీ అనుకుంటే వర్తమానంలో కేజీఎఫ్ 2 చిత్రంలో రమికా సేన్ అనే నాయకురాలిగా హుందా అయిన పాత్రలో కనిపించింది. ఇటీవలే రవీనా టాండన్ కు కేంద్రం పద్మశ్రీని ప్రకటించిన అనంతరం పలు మీడియాలతో మాట్లాడుతూ రవీనా తన కెరీర్ సీక్రెట్స్ గురించి వెల్లడిస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను కెరీర్ లో ఎంత హాట్ గా కనిపించినా ఆనీ  ఎప్పుడూ ముద్దు సన్నివేశాలు చేయలేదని.. స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ధరించలేదని వెల్లడించారు.  తాజా ఇంటర్వ్యూలో ఈత దుస్తులను ధరించడం లేదా సినిమాల్లో ముద్దుల సన్నివేశాలను నిరాకరించినందుకు నన్ను 'అహంకారి'గా పరిశ్రమలో ముద్ర వేశారని వెల్లడించారు.

నటనకు సంబంధించిన కొన్నిటితోనే తాను కంఫర్ట్ గా ఉంటానని... అనవసర భంగిమలు లేదా ఈత దుస్తులను ధరించడం లేదా ముద్దు సన్నివేశాలు చేయడం వంటి తనకు అసౌకర్యం కలిగించే సన్నివేశాలు చేయలేదని రవీనా వెల్లడించారు. రేప్ సన్నివేశాల్లో బట్టలు చించుకోని ఏకైక నటిని తాను మాత్రమేనని.. దీనివల్ల కూడా తనను అహంకారి అని పిలిచారని రవీనా పేర్కొంది.

నైన్టీస్ లో స్వీయ నిబంధనలు షరతులపై సినిమాలకు పని చేశాను. అసౌకర్యం కలిగించే ఆఫర్లు  వస్తే చేయనని చెప్పడంతో అవకాశాలు తగ్గాయని వెల్లడించారు. రవీనా తదుపరి రొమాంటిక్-కామెడీ 'ఘుడచాడి' సహా 'పట్నా శుక్లా'లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.