Begin typing your search above and press return to search.

బొద్దు తొడ‌ల వ‌ల్లే నాకు అవ‌కాశాలిచ్చారు!

By:  Tupaki Desk   |   7 Feb 2023 11:00 AM GMT
బొద్దు తొడ‌ల వ‌ల్లే నాకు అవ‌కాశాలిచ్చారు!
X
క‌మిట్ మెంట్ల‌ గురించి.. బాడీ షేమింగ్ గురించి వేదిక‌ల‌పై మాట్లాడాలంటే ఒక‌ప్పుడు న‌టీమ‌ణులు భ‌య‌పడేవారు. కానీ ఇప్పుడ‌లా కాదు. ఇది సోష‌ల్ (డిజిట‌ల్) మీడియా యుగం. ఈ యుగం స్వేచ్ఛ‌కు ప‌రాకాష్ట‌. పురుషుల‌కు ధీటుగా స్త్రీ స్వేచ్ఛకు ఇప్పుడు ఎల్ల‌లు లేవు. స‌రిహ‌ద్దులు లేవు! వారు త‌మ జీవితాల‌లో జ‌రిగే ఎలాంటి విష‌యాన్ని అయినా బ‌హిరంగంగా మాట్లాడే స్వేచ్ఛ‌ను క‌లిగి ఉన్నారు! మీటూ వేదిక‌గా త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను బ‌హిరంగంగా వెల్ల‌డిస్తున్నారు. ఇది స‌రికొత్త ఒర‌వ‌డి.

చాలా మంది క‌థానాయిక‌లు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపులు.. బాడీ షేమింగ్.. వ‌ర్ణ వివ‌క్ష లాంటి సంక్లిష్ఠ అంశాల‌ గురించి బ‌హిరంగంగా వేదిక‌ల‌పైనే మాట్లాడి ప్ర‌కంప‌నాలు సృష్టించారు. స్వేచ్ఛా ప్ర‌సంగాలతో బ‌హిరంగ వాద‌న‌ల‌తో పురుషాధిక్య ప్ర‌పంచంపై ఎదురెళ్లే ధీర‌త్వం నేటి ధీర‌ల్లో సంచ‌లనంగా మారుతోంది.

సావిత్రి- జమున కాలం కాదు ఇది. క‌నీసం విజ‌య‌శాంతి- రాధ‌ల సీజ‌న్ అయినా కాదు. ఇప్పుడు  శ్రుతిహాస‌న్- హ‌నీరోజ్ ట్రెండ్ న‌డుస్తోంది. కానీ ఇలాంటి రోజుల్లోనూ నాటి మేటి క‌థానాయిక‌లు డేరింగ్ గా థై షోస్ గురించి మాట్లాడారంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. అంత‌టి ధైర్యం చేసిన‌ది ఎవ‌రు? అంటే...బాలీవుడ్ నటీమణులు ముఖ్యంగా 80లు 90లలో తాము ఎదుర్కొన్న సమస్యల గురించి తరచుగా మాట్లాడుతున్నారు. వేతన వ్యత్యాసాల నుండి హీరోల మేల్ డామినేష‌న్ గురించి మాట్లాడుతున్నారు. కుట్ర‌ల‌తో త‌మను సినిమాల నుంచి తొలగించడం గురించి.. నెపోటిజం గురించి బాలీవుడ్ లో కఠినమైన వాస్తవాల‌ను బహిర్గతం చేస్తున్న డేరింగ్ న‌టీమ‌ణుల‌ను మనం చూస్తున్నాం.

ఇప్పుడు సీనియ‌ర్ న‌టి రవీనా టాండన్ వంతు. 90వ దశకంలో తాను చాలా సిగ్గ‌రిగా ఉండేదానిని అని బాడీ షేమింగ్ జ‌రిగినా దాని గురించి ఎక్క‌డా మాట్లాడ‌లేద‌ని గుర్తు చేసుకున్నారు. త‌న‌ను థై థండ‌ర్ క్వీన్ (థండ‌ర్ తొడ‌ల రాణీ) అని పిలిచేవార‌ని గుర్తు చేసుకుంది. తన తొడ‌లు చాలా బొద్దుగా ఉండేవని అందుకే అలా పిలిచేవార‌ని తెలిపింది. ఇవే తొడ‌లు త‌న‌కు కొంత మైన‌స్ అయితే అవే అవ‌కాశాలు తెచ్చాయ‌ని ర‌వీనా బోల్డ్ గా వ్యాఖ్యానించారు.

ఇటీవల రవీనా టాండన్ పరిశ్రమలో త‌న‌పై విమర్శల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. చాలావ‌ర‌కూ వాస్తవాలు చెబుతున్నప్పటికీ తాను వాటిని అతిశయోక్తిగా చెబుతున్నానని వెల్లడించింది. తన తాజా ఇంటర్వ్యూలో ర‌వీనా మాట్లాడుతూ 90ల నాటి జర్నలిజం 'దుర్మార్గం'పై తాను పూర్తిగా అసంతృప్తిగా ఉండేదానిని అని తెలిపారు. వివాహం తర్వాత పరిశ్రమ నుండి విరామం తీసుకున్నట్లు తెలిపింది.

ర‌వీనా పాత రోజులను గుర్తుచేసుకుంటూ చాలా సంగ‌తులే చెప్పారు. నిజానికి 90లలో పాటల్లో నేను నిజానికి బొద్దుగా క‌నిపిస్తాను. ప‌ద‌హారేళ్ల‌ వయస్సులో కెరీర్ ప్రారంభించాను. నేను బేబీ ఫ్యాట్ లుక్ తో క‌నిపించేదానిని. అది ఇప్పటికీ పోలేదు. నేను ఇప్పుడు పట్టించుకోను కానీ.. అప్ప‌ట్లో  నాపై కామెంట్ల‌కు బాధ‌ప‌డేదానిని! అని తెలిపారు. నేను చూసేందుకు ఎలా ఉన్నా కానీ అవి చెడ్డ వ్యాఖ్య‌లు అని కూడా అన్నారు. మీడియా హెడ్డింగులలో కొన్ని నాకు ఇంకా గుర్తున్నాయి. నేనే కాదు మరికొందరు హీరోయిన్ల ప‌రిస్థితి కూడా ఇదే. అది కాకుండా ఆడ‌వారికి మద్దతు ఇవ్వడానికి బదులుగా మీడియా వారు ఏం చేసేవారంటే?...నిజానికి ఈ మహిళా సంపాదకులంతా హీరోలతో ప్రేమలో పడతారు. హీరోలు చెప్పేవే రాస్తారు.

ఎవ‌రైనా ఒక హీరో ఒక న‌టి లేదా నాయిక‌ను నాశ‌నం చేయాలనుకుంటే ఆ స్త్రీ (మహిళా సంపాద‌కురాలు) ఆ న‌టిపై అసహ్యకరమైన కథనాలను ప్రచురిస్తుంది. త‌ద్వారా న‌టీమ‌ణి వృత్తిని నాశనం చేస్తుంది. అక్షరాల‌తోనే ఆ సంపాద‌కురాలు అవమానిస్తుంది. కొంద‌రు హీరోలు హీరోయిన్ల‌పై అవాస్త‌వ క‌థ‌నాలు రాయించిన సంద‌ర్భాలున్నాయి. ఈ రంగంలో హీరో ఏం చెబితే అదే చివరి మాట అవుతుంది. ఒక‌వేళ త‌ప్పురాసి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌స్తే...స‌దరు మ్యాగజైన్ లేదా ప‌త్రిక‌ త‌దుప‌రి సంచికల్లో చివరి లైన్ లో ఆ విష‌యాన్ని వేస్తుంది. ముందు రాసిన క‌థ‌నం చివరికి నిజం కాదని నిరూపిత‌మైంది! అని రాస్తారు. మరి అలాంటప్పుడు ఈ త‌ప్పుడు మీడియా క‌థ‌ల‌ను ఎవరు చదువుతారు? ఆ సమయంలో అలాంటి హెడ్ లైన్స్ స‌రే... ఇప్ప‌టికీ అలాంటివి క‌నిపిస్తున్నాయి! ఇది సరియైనదేనా? అని ర‌వీనా ప్ర‌శ్నించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ర‌వీనా టాండన్ త‌దుప‌రి వరుస సినిమాలు వెబ్ సిరీస్ ల‌తో బిజీగా ఉన్నారు. సతీష్ కౌశిక్ తో పాట్నా ... శుక్లా- సంజయ్ దత్ ల‌తో 'ఘుడ్చాడి' లాంటి ఆస‌క్తిక‌ర‌ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. అరణ్యక్ రెండవ సీజన్ లోను క‌నిపించ‌నుంది. ఇంకా ప‌లు ఆసక్తికరమైన చిత్రాల్లోను న‌టిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.