'హీరోల బెడ్ రూమ్ కి వెళ్లడానికి నిరాకరించడం వల్లే నాపై దుష్ప్రచారం చేశారు'

Wed Aug 05 2020 22:30:08 GMT+0530 (IST)

'I was slandered for refusing to go to the heroes' bedroom'

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించినప్పటి నుంచి ఇండస్ట్రీలో నెపోటిజం పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ మరణానికి నెపోటిజం కూడా ఒక కారణమని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు బహిరంగంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బాలీవుడ్ లో జరుగుతున్న అరాచకాలపై కూడా ఒక్కొక్కరుగా ముందుకువచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయం గురించి తన పట్ల కొందరు వ్యవహరించిన విధానం గురించి చెప్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రముఖ ప్రసార మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రవీనా నెపోటిజం - ఫేవరిటిజం చాలా ఎక్కువ అని పేర్కొంది.రవీనా మాట్లాడుతూ.. తమ ఫ్యామిలీకి సంబంధించిన వారిని ఎంకరేజ్ చేయడం.. వారికే అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా హీరోయిన్లతో హీరోలు చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారని.. సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందనే కొద్ది గంటల ముందు కూడా హీరోయిన్లను తీసివేయడం జరుగుతుందని వెల్లడించింది. బాలీవుడ్ హీరోలు నాకు పొగరు అహంకారం ఎక్కువని ప్రచారం చేసారు.. వారి బెడ్ రూమ్ కి వెళ్లడానికి నేను నిరాకరించడం వల్లే నాకు వ్యతిరేకంగా అలాంటి దుష్ప్రచారం చేశారు. తమ గర్ల్ ఫ్రెండ్స్ మరియు వారికి పేవర్ గా ఉండే జర్నలిస్టులను ఉపయోగించుకొని హీరోయిన్లను దెబ్బ తీస్తారు అని పేర్కొంది.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. కొందరు మహిళా జర్నలిస్టులు కూడా వారికి పావులుగా మారడం నాకు ఆశ్చర్యం కలిగించిందని.. వారు నాపై కూడా చెత్త రాతలు రాసి హీరోయిన్ గా నా అవకాశాలను దెబ్బ తీయడానికి అలాంటి దుష్ప్రచారం చేశారని రవీనా తెలిపారు. అయితే నేను ఆ చెత్త రాతలను పెద్దగా పట్టించుకోలేదు. నా పని ఏదో నేను చూసుకొంటూ వెళ్ళాను. అలాంటి వారిని నేను ధైర్యంగా ఎదుర్కొన్నాను. బాలీవుడ్ ఇండస్ట్రీలో తడి గుడ్డతో గొంతులు కోసే రాజకీయాలు మాఫియా ఉన్నాయని రవీనా టాండన్ తన అనుభవాలను వెల్లడించారు.