Begin typing your search above and press return to search.

గూస్ బంప్స్ తెప్పించేలా రావణాసుర థీమ్ సాంగ్

By:  Tupaki Desk   |   7 Feb 2023 9:05 AM GMT
గూస్ బంప్స్ తెప్పించేలా రావణాసుర థీమ్ సాంగ్
X
మాస్ మహారాజా రవితేజ వరుస హిట్ మూవీస్ తో దూసుకెళ్తున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాల తర్వాత రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం రావణాసుర. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.

ఈ చిత్రాన్నిఅభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ సంవత్సరం వేసవిలో విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రాలలో రావణాసుర ఒకటి. అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒక్కో అప్డేట్ లను వదులుతోంది. ఇక ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సంగీతం అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా థీమ్ సాంగ్‌ ని విడుదల చేశారు మేకర్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ థీమ్ సాంగ్ హైలీ ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు.

రావణ అనే చాంట్ తో మొదలైన ట్రాక్ వైబ్రెంట్ గా ఉంది. పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్, నోలిక్ ఈ థీమ్ సాంగ్ ఎనర్జిటిక్ గా పాడారు. పాట చరణంలో వినిపించిన శివతాండవం గూస్ బంప్స్ ను తెప్పించే విధంగా ఉంది. ఈ పవర్ ఫుల్ థీమ్ సాంగ్ రావణాసుర మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి.

రవితేజ బర్త్ డే కు విడుదలైన గ్లింప్స్ కు ఇప్పటికే  మంచి రెస్పాన్స్ వచ్చింది. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌ తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.

సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఏప్రిల్ 7, 2023న వేసవిలో రావణాసుర ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.